Homeఎంటర్టైన్మెంట్Acharya Movie: ఆచార్య మూవీ నుంచి "నీలాంబరి" సాంగ్ ప్రోమో ఔట్...

Acharya Movie: ఆచార్య మూవీ నుంచి “నీలాంబరి” సాంగ్ ప్రోమో ఔట్…

Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్న సినిమా ” ఆచార్య “. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చిరు – చరణ్ ఒకే సినిమాలో కనిపిస్తుండడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్… రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే అలరించనున్నారు. అయితే తాజాగా మూవీకి సంబంధించి అభిమానులకు మెగా గిఫ్ట్ అందించింది చిత్ర బృందం.

neelambari song promo out from acharya movie

కాగా దీపావళి కానుకగా ”నీలాంబరి” సాంగ్ ప్రోమో ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ప్రోమో లో చరణ్ – పూజ హెగ్డే ల మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉంది. టెంపుల్ లొకేషన్ లో ఈ పాట చిత్రీకరించినట్లు కనబడుతుంది. లిరిక్స్ కూడా అధ్బుతంగా ఉన్నాయి. సింపుల్ స్టెప్స్ తో చరణ్ … తన క్యూట్ లుక్స్ తో పూజ అదరగొట్టారని చెప్పాలి. నీలాంబరి పూర్తి పాటను నవంబర్ 5 వ తేదీన ఉదయం 11;07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది.

#Acharya​ - Neelambari Song Promo |Megastar Chiranjeevi, Ram Charan​, Kajal,PoojaHegde |KoratalaSiva

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ఆచార్య ను  విడుదల చేయనున్నారు. ఇప్పటికే  ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్, పోస్టర్లకు మంచి స్పందన లభించగా.. .ఈ పాటతో అంచను మరింత పెరిగాయి. ఈ సినిమాకు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన  మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్  అందించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version