Trisha: తమిళనాడు రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారాయో ప్రతీ రోజు మనం సోషల్ మీడియా , టీవీల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. హీరో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సీఎం విజయ్ పెరంబూరు తో పాటు , తిరుచ్చి స్థానం లో పోటీ చేసి , రెండు స్థానాల్లో గెలుపొందారు. దీంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం , రెండిట్లో ఎదో ఒక స్థానానికి విజయ్ రాజీనామా చెయ్యాలి. ఆ తర్వాత ఆ స్థానం లో ఉప ఎన్నికలు జరుగుతాయి. విజయ్ తిరుచ్చి స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. సరిగ్గా అదే సమయం లో రాఘవ లారెన్స్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని ప్రకటన చేయడం తో , ఆయన TVK విజయ్ పార్టీ లో చేరి, తిరుచ్చి స్థానం నుండి పోటీ చేస్తారని సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరిగింది.
అయితే దీనిపై లారెన్స్ క్లారిటీ ఇస్తూ నేడు ఒక వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో లో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని , తానూ తిరుచ్చి స్థానం నుండి పోటీ చేయబోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ త్రిష పేరు తెరమీదకు వచ్చింది. ఆమె TVK పార్టీ తరుపున తిరుచ్చి స్థానం నుండి పోటీ చేయబోతోందని , త్వరలోనే ఆమెని మనం ఉప ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము అంటూ సోషల్ మీడియా లో విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా , తెరవెనుక TVK పార్టీ అంతర్గత కార్యక్రమాలను చూసుకుంటూ బిజీ గా ఉంటుంది. ఈ తిరుచ్చి స్థానం ద్వారా ఎమ్మెల్యే గా పోటీ చేసి , రాజకీయ అరంగేట్రం చేయాలనీ , తద్వారా ఆమె ఉప ముఖ్యమంత్రిగా , లేదా క్యాబినెట్ లో పవర్ ఫుల్ మంత్రి హోదా ని సంపాదించుకునే అవకాశం ఉందని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఈమధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ వేళ , ఏదైనా జరగొచ్చు , త్రిష ని నిజంగానే ఉపముఖ్యమంత్రిగా చూడొచ్చేమో , ఎవరు అంచనా వేయగలరు?, అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ , విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
