Sri Reddy: సోషల్ మీడియా హిట్ పెయిర్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు షణ్ముక్, దీప్తి సునైన. యూట్యూబ్ లో వీళ్ళు చేసే కవర్ సాంగ్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వీళ్ళ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటాయి. వీరి పెయిర్ కి కూడా చాలా మందే అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. అయితే ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు విడిపోయారు. అయితే తాజాగా నటి శ్రీ రెడ్డి కూడా దీప్తి, షన్నుల బ్రేకప్ పై స్పందించింది.
ఈ మేరకు దీప్తి సునయన పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. షన్నుకు బ్రేకప్ చేప్పడానికి కారణం బిగ్ బాస్ హౌస్ లో షన్ను చేసిన దాని గురించే అని అందరికి అర్థం అవుతుందని ఆమె అన్నారు. అయితే దీప్తి గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో దీని కంటే ఎక్కువే చేసిందని శ్రీరెడ్డి అన్నారు. దీప్తి ని ఉద్ధేశించి నువ్వు చేస్తే ఒక న్యాయం, షణ్ముఖ్ చేస్తే ఒక న్యాయమా అని ప్రశ్నించింది. దీప్తి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి చాలా క్లోజ్ గా ఉందని… అది ప్రేమ అని అందరూ అనుకున్నారని శ్రీ రెడ్డి అన్నారు.
షణ్ముఖ్ తో పెళ్లి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పావని పెళ్లయ్యుంటే వదిలేసే దానివా అని దీప్తిపై ఫైర్ అయింది. ఓపికతో చర్చించి ఒక అండర్ స్టాండింగ్ రావాలే తప్ప ఇలా విడిపోవడం సరైంది కాదని శ్రీరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే దీప్తి, షణ్ముఖ్ టాటూల పై కూడా శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే ఎప్పుడు మహిళలకే సపొర్టు చేసే శ్రీ రెడ్డి… మొదటి సారి షణ్ముక్ కు మద్దతుగా మాట్లాడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.