https://oktelugu.com/

Jobs: ఎయిమ్స్ గోరఖ్ పూర్ లో 105 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 105 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. https://aiimsgorakhpur.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలు 28, అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలు 22, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 5, 2022 / 10:20 AM IST
    Follow us on

    Jobs: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 105 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. https://aiimsgorakhpur.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ప్రొఫెసర్ల ఉద్యోగ ఖాళీలు 28, అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలు 22, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలు 23, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలు 32 ఉన్నాయి.

    పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, రేడియోథెరపీ, యూరాలజీ విభాగాలతో పాటు బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, న్యూరోసర్జరీ, పాథాలజీ, అనెస్తీషియాలజీ, అనాటమీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది. మెడికల్‌ డిగ్రీ/తత్సమాన డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 58 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. https://aiimsgorakhpur.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు అర్హతకు తగిన జాబ్స్ లభిస్తున్నాయి.