https://oktelugu.com/

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’కు పోటీగా భారీ బడ్జెట్ చిత్రాలు..!

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా  ఈ సంక్రాంతికి రావడం పక్కా అని అంతా భావించారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం వీరలెవల్లో ప్రమోషన్స్ చేస్తుండటంతో జనవరి 7న థియేటర్లలో ఈమూవీ వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఎప్పటిలాగే రాజమౌళి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లుచల్లారు. సినిమా విడుదలకు పరిస్థితులు సహకరించడం లేదని తీరిగ్గా స్టేట్మెంట్ ఇచ్చి ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాల పరంపరను కంటిన్యూ చేశారు. అయితే ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో చాలా సినిమాలు తమ విడుదల […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2022 / 09:37 AM IST
    Follow us on

    RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా  ఈ సంక్రాంతికి రావడం పక్కా అని అంతా భావించారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం వీరలెవల్లో ప్రమోషన్స్ చేస్తుండటంతో జనవరి 7న థియేటర్లలో ఈమూవీ వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఎప్పటిలాగే రాజమౌళి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లుచల్లారు. సినిమా విడుదలకు పరిస్థితులు సహకరించడం లేదని తీరిగ్గా స్టేట్మెంట్ ఇచ్చి ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాల పరంపరను కంటిన్యూ చేశారు.

    అయితే ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో చాలా సినిమాలు తమ విడుదల తేదిని మార్చుకున్నాయి. 2022 సంక్రాంతి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు సమ్మర్ ను టార్గెట్ చేశాయి. అయితే ‘ఆర్ఆర్ఆర్’ను వాయిదా వేసిన రాజమౌళి దృష్టి సమ్మర్ పై పడినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం పెద్ద సినిమాలు సైడ్ ఇచ్చే అవకాశం కన్పించడం లేదు.

    దీంతో ఈసారి సమ్మర్ రేసు రసవత్తరంగా సాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈ వేసవిలో ‘ఆర్ఆర్ఆర్’తోపాటు మరో ఆరు సినిమాలు రాబోతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్-2’ మూవీ ఏప్రిల్ 14న రానుంది. ఈ మూవీ 300కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కింది. కేజీఎఫ్ మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో కేజీఎఫ్-2పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారిపాట’ ఏప్రిల్ 1న రానుంది. ఈ మూవీ సంక్రాంతి కానుక వస్తుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 1కి వాయిదా పడింది. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ సంస్థ భారీ బడ్జెట్లోనే ఈ మూవీని నిర్మిస్తోంది. తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ మూవీ కూడా సమ్మర్ లోనే రానుంది.

    బాలీవుడ్ హీరో అమీర్ ఖాల్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ కేజీఎఫ్ పోటీగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ మూవీకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్-3’ సమ్మర్ బరిలో ఉంది. ఈ మూవీని 80కోట్ల బడ్జెట్లో నిర్మించగా 100కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉంది.

    అయితే ‘ఆర్ఆర్ఆర్’ సమ్మర్ రేసులోకి వస్తే ఇతర సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండనుంది. మరీ ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు ఎవరికీ ఇబ్బంది కలుగని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటారా? లేదంటే మా సినిమా మాదేనని మొండిగా ముందుకెళుతారా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!