Homeఎంటర్టైన్మెంట్Pragathi: చిన్న వయసులోనే తల్లిగా మారాను.. కారణం ఎవరో చెప్పి షాకిచ్చిన నటి ప్రగతి

Pragathi: చిన్న వయసులోనే తల్లిగా మారాను.. కారణం ఎవరో చెప్పి షాకిచ్చిన నటి ప్రగతి

తాజాగా ప్రగతి తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అందరిలానే కథనాయక కావాలనే ఆశలతో సినీ పరిశ్రమకు వచ్చినట్లు ప్రగతి తెలిపారు.

Pragathi: సినీ నటి ప్రగతి.. తెలుగు చిత్ర పరిశ్రమలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. పలు చిత్రాల్లో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తుంటారు ప్రగతి.. అంతేకాదు ఆమెకు ఏ పాత్ర ఇచ్చిన అందులో ఇట్టే ఇమిడిపోతారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు..

ప్రగతి సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సీరియళ్లలో ఆమె ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. వెండితెర, బుల్లితెరపై రాణిస్తున్న ప్రగతి సామాజిక మాధ్యమాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆమె దైనందిత జీవితాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా ప్రగతి తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అందరిలానే కథనాయక కావాలనే ఆశలతో సినీ పరిశ్రమకు వచ్చినట్లు ప్రగతి తెలిపారు. అయితే కొంతకాలం ఎటువంటి అవకాశాలు రాకపోగా మరికొన్ని ఛాన్స్ లు వచ్చి చేజారిపోయాయన్నారు. దీంతో హీరోయిన్ గా రాణించాలనే ఆశను వదులుకుని చిన్న చిన్న పాత్రలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విధంగా అమ్మ పాత్రలు చేయడానికి ప్రధాన కారణం తన మంచిని ఆశించే ఓ వ్యక్తి చెప్పారట. కథనాయకగా చేస్తే కొద్ది రోజులు మాత్రమే రాణించగలం.. అదే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉంటే లైఫ్ లాంట్ ప్రేక్షకుల మదిలో నటిగా చెరగని ముద్ర వేసుకోవచ్చన్న సూచనతో తాను తల్లి పాత్రలు చేస్తున్నట్లు ప్రగతి వెల్లడించారు. ఆ విధంగానే చిన్న ఏజ్ లోనే అమ్మగా మారిపోయానని చెప్పుకోచ్చారు.

అంతేకాదు.. నటిగా ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రగతి రియల్ లైఫ్ లో ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధను కనబరుస్తారు. ఆమె వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగళూరులో జరిగిన బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ప్రగతి పాల్గొన్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం సాధించిన ఆమె మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో ప్రగతి టాలెంట్ చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper