Actress Nayanthara : సౌత్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ స్టార్ హీరోయిన్ లలో ముందు పేరు నయనతారదే ఉంటుంది. ఈమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నాయి. నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో మెయిన్ రోల్ లో నటించి ప్యాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాల షూటింగ్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఇంత సంపాదిస్తున్న నయనతారకు ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉందట.
మొత్తంగా నయనతారకు రూ. 200 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా రూ. 50 కోట్లు పెట్టి ప్రైవేట్ జెట్ కొన్నారు. ఈ జెట్ ను రెండు సంవత్సరాల క్రితం కొన్నారట నయన్. దీన్ని నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరు కలిసి వాడుతారు. షూటింగ్ లకు వెళ్లడానికి, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఆ ప్రైవేట్ జెట్ ను వాడుతున్నారు. అంతే కాదు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ గా మారాయి.
ప్రైవేట్ జెట్ తో పాటు ఈ అమ్మడకు చెన్నై, హైదరాబాద్ లలో ఖరీదైన ఇల్లు కూడా ఉన్నాయి. అంతేకాదు కేరళలో మరో ఇల్లు ఉంది. కేరళ, తమిళనాడు వ్యాప్తంగా కూడా స్థలాలు ఉన్నాయట. ఇక కార్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నయనతార లక్ష్మీ సినిమాతో 2006లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమకు లక్ష్మీ సినిమాతోనే పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అలా మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించేలా చేసింది. ఇక చిరంజీవి కలిసి చివరగా గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. రీసెంట్ గానే జవాన్ సినిమాలోనూ మెరిసింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Actress nayanthara private jet details
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com