Jai Bhim: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా జై భీమ్. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి టి. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. 1993 లో తన భర్త కోసం ఓ గిరిజన మహిళ చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ బరీ వారి పాత్రలకు ప్రాణం పోశారని చెప్పాలి. చంద్రు పాత్రకు సూర్య జీవం పోశారు. కాగా, గిరిజన మహిళ పాత్రలో నటి లిజోమోల్ నటించింది. ఇందులో నటించిన అందరికి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జొస్ కి అందరి అభినందనలు దక్కుతున్నాయి.