Actor Surya: తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సూర్య. తనదైన నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేయగలడు సూర్య. గజిని, యముడు, సింగం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సూర్య. అయితే హీరో సూర్య ఇటీవల జై భీమ్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ వేదికగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా చిత్రానికి ప్రశంసలు దక్కాయి.

అయితే ఈ సినిమాలో సూర్య తన పాత్రకు ప్రాణం పోశారని చెప్పాలి. కాగా ఈ సినిమాలో ఒక వర్గానికి సానుకూలంగా ఉండటంపై పీఎమ్‌కే పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సూర్యను, ఆ చిత్ర బృందాన్ని కొట్టిన వారికి రూ. లక్ష బహుమానం గా ఇస్తామని చెప్పారు.
దీంతో పీఎమ్‌కే పార్టీ చేసిన ప్రకటన పై సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ వర్గానికి చెందిన వారు రాజకీయంగా బలంగా ఉన్న సామాజికంగా చాలా బలహీనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి సినిమా పై పీఎమ్‌కే పార్టీ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా చాలా మంది సినీ అభిమానులు సూర్య కు మద్దత్తు గా #WeStandWithSuriya అనే హ్యాస్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమా పార్వతి అమ్మాళ్ అనే మహిళ జీవితంపై తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆమెకు రాఘవ లారెన్స్ ఆమెకు సొంత ఇల్లు కటిస్తానని మాట ఇచ్చారు. అలానే సూర్య కూడా తన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా విషయం తెలిసిందే.