Kaikala Satyanarayana: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మొదటి తరం నటులలో కైకాల సత్యనారాయణ ఒకరు. నవరస నట ప్రపూర్ణ గా సిల్వర్ స్క్రీన్ ని ఏలిన వెండితెర యముడు కైకాల, తన నట ప్రస్థానం లో అనేక మైలురాళ్ళు దాటారు. 86 ఏళ్ల కైకాల అస్వస్థకు గురయ్యారని తెలిసి యావత్ తెలుగు లోకం తల్లడిల్లిపోతుంది. ఆయన కోలుకుని తిరిగి రావాలని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కైకాల ఆరోగ్యం మెరుగుపడినట్టు చిరంజీవి అప్డేట్ ఇచ్చి, కొంత ఆందోళన తగ్గించారు.
Also Read: ఈ యంగ్ హీరో చిరంజీవికి భలే దగ్గరయ్యాడే! ఎలాగో తెలుసా?

కాగా కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) కెరీర్ లో అత్యధికంగా విలన్ పాత్రలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాలు కైకాల సత్యనారాయణ తిరుగులేని విలన్. ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు రెండు తరాల టాప్ హీరోల క్రేజీ విలన్ గా సత్యనారాయణ కెరీర్ సాగింది.యుక్త వయసులో ఉన్నప్పుడు దర్శకులు ఎక్కువగా ఆయనకు ఆడవాళ్లను హింసించే పాత్రలు ఇచ్చారు. ఆడవాళ్లను మోసం చేయడం, మానభంగాలు చేయడం వంటి పాత్రలు కైకాలకు దక్కేవి.
ఆ తరం ప్రేక్షకులకు సినిమా అంటే అంత అవగాహన ఉండేది కాదు. సిల్వర్ స్క్రీన్ పై నడిచే డ్రామా మొత్తం నిజం అనుకునేవారు. కరుడుగట్టిన విలన్ పాత్రల్లో తరచుగా కనిపించిన కైకాల సత్యనారాయణపై సమాజంలో చాలా బ్యాడ్ ఇమేజ్ ఉండేదట. ముఖ్యంగా ఆడవాళ్లు కైకాలను అసహ్యించుకునేవారట. ఓ పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్న సత్యనారాయణకు ఆడవాళ్లు చుక్కలు చూపించారట.
ఆ కార్యక్రమంలో కైకాలను ఉద్దేశిస్తూ ఓ మహిళ, ఆ సత్తిగాడ్ని వెనకనుండి పొడిచేయాలని అందట. మరో మహిళ నేరుగా దగ్గరికి వచ్చి, ఎందుకయ్యా ఆడవాళ్లను అలా హింసిస్తావూ… అంటూ ముఖం మీద అడిగిందట. అదంతా కేవలం నటన అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట కైకాల. అప్పట్లో రేపుల నారాయణ అని కూడా కైకాలను పిలిచేవారట. ఓ ఇంటర్వ్యూలో కైకాల ఈ ఆసక్తికర విషయాలు ఆడియన్స్ తో పంచుకున్నారు. ప్రేక్షకులు నిజ జీవితంలో కూడా అసహ్యించుకునేలా కైకాల తన విలనిజం పండించేవారని దీని ద్వారా అర్థం అవుతుంది.