Acid Attack: ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ద్వేషం నాశనాన్ని ఆశ్రయిస్తుంది. కోరుకున్న వాడు దక్కలేదనే అక్కసుతో ప్రియుడిపైనే యాసిడ్ పోసి తనలోని కర్కశత్వాన్ని చూపించింది. సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఆమె తీరుపై విమర్శలు వస్తున్నాయి. నూరేళ్లు జీవించాల్సిన యువకుడి జీవితం అగాధంలో పడిపోయింది. ఆమె యాసిడ్ పోయడంతో అతడి రెండు కళ్లు పోయాయి. ఇంత దౌర్జన్యం చేసిన ఆమెపై కేసు నమోదైనా ప్రియుడి జీవితం మాత్రం నరకప్రాయంగా మారింది.
Also Read: ఇన్ స్టాలో పరిచయం.. రమ్మంటే వెళ్లిన 14 ఏళ్ల బాలిక..

కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఆదిమళి గ్రామానికి చెందిన షీబా(35) గృహిణి. ఆమెకు భర్త, ఇదద్రు పిల్లలున్నారు. భర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా జీవించాల్సిన భార్య ఫేస్ బుక్ లో అరుణ్ కుమార్ (28)తో పరిచయం పెంచుకుంది. అతి కాస్త ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు ఒక్కటయ్యేందుకు సహకరించింది. తాను ఒంటరినని చెప్పడంతో అతడు ఆమెతో కలిసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా పలుమార్లు కలుసుకుని తమ కోరికలు తీర్చుకునే వారు. దీంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ అతడికి ఆమెకు పెళ్లయిందనే విషయం తెలియడంతో ఆమెను దూరం పెట్టాడు.
అయినా ఆమెలో మార్పు కనిపించలేదు. నువ్వు నాకు కావాలని గోల చేసింది. దీనికి అతడు మాత్రం ఒప్పుకోలేదు. అవసరమైతే పిల్లలు, భర్తను వదిలేసి వస్తానని చెప్పడంతో అతడు అంగీకరించలేదు. దీంతో ఆమె బ్లాక్ మెయిల్ కు దిగింది. తనను పెళ్లి చేసుకోకపోతే మనం ఇద్దరం కలుసుకున్న ఫొటోలు లీక్ చేస్తానని చెప్పడంతో అరుణ్ డబ్బులు ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నాడు.
దీంతో ఆమె ప్లాన్ బెడిసికొట్టడంతో ఆమె మరో పథకం వేసింది. ఈనెల 16న ఆదిమళిలోని చర్చి వద్ద కలుసుకుని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ తీసుకుని అతడి ముఖం మీద పోసింది. దీంతో అతడు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడిని ఆమెను ఆస్పత్రికి తరలించారు. అరుణ్ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురం మెడికల్ కళాశాలకు తరలించారు. యాసిడ్ దాడిలో అతడి రెండు కళ్లు దెబ్బతిని చూపు కోల్పోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలు షీబాను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
Also Read: ప్రియుడు మాట్లాడడం లేదని డయల్ 100కు ఫోన్ చేసిన లవర్