
టాలీవుడ్ యూత్ ప్రేక్షకుల గుండె గిల్లిన కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్. చూడగానే భలేఉందే అనిపించే రూపుతో.. ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయిందీ బ్యూటీ. దీంతో.. ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. తనదైన ముద్ర వేసిందీ అమ్మడు. అయితే.. సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా సైతం అభిమానులకు అందుబాటులో ఉంటుందీ భామ. కెరీర్ తోపాటు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటో సంచలనంగా మారింది. అమ్మాయి న్యూడ్ ఫోటో షేర్ చేసింది అనుపమ.
తెలుగులో శతమానం భవతి, అ ఆ, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి చిత్రాలతో యూత్ కు బాగా దగ్గరైంది అనుపమ. దీంతో.. వరుస ఆఫర్లు వచ్చాయి. కొవిడ్ నేపథ్యంలో రేసులో కాస్త వెనుకబడింది. 2019లో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం చివరిది. అయితే.. టీమిండియా క్రికెటర్ బుమ్రాతో లవ్ ట్రాక్ నడిపిస్తోందన్న వార్తలతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. బుమ్రా ఇటీవల వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ప్రేమాయణం పుకారేనని తేలిపోయింది.
ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో తరచూ అభిమానులతో టచ్ లో ఉంటుందీ భామ. తన జీవిత విశేషాలతోపాటు వివిధ అంశాలపై పోస్టులు చేస్తూ ఉంటుంది. తాజాగా.. ఇన్ స్టాగ్రామ్ లో ఓ న్యూడ్ ఫొటో షేర్ చేసింది. మొత్తం ఫొటో కాకుండా.. నడుము నుంచి తొడలవరకు కనిపించే ఫొటోను పోస్ట్ చేసింది.
ఇందులో తొడ భాగం, బటక్స్ ను హైలెట్ చేసింది. ఆ భాగాలపై చారలు కనిపిస్తున్నాయి. సహజంగా చాలా మందిలో ఇలాంటి చారలు ఉంటాయి. ఈ సమస్యను ప్రస్తావించే ఉద్దేశంతో షేర్ చేసిందో ఏమోగానీ.. అనుపమ న్యూడ్ ఫొటో షేర్ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. అయితే.. తాను ఎందుకు ఈ ఫొటోను పోస్ట్ చేశానన్నది మాత్రం చెప్పలేదీ బ్యూటీ. మరి, తర్వాతైనా చెబుతుందేమో చూడాలి.
