https://oktelugu.com/

Chiranjeevi: ప్చ్ ఆయన మాటలు చిరంజీవిని బాధ పెట్టాయి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఓ ప్రభంజనం అన్నట్టు ఊగిపోతుంటారు అభిమానులు. చిరంజీవి ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు. సినిమా వాళ్లకు ఏ కష్టం వచ్చినా ప్రస్తుతం వాళ్లకు కనిపిస్తున్న పెద్ద దిక్కు చిరంజీవి ఒక్కరే. మెగా అభిమానులు కూడా మెగాస్టార్ ను ఇండస్ట్రీ పెద్ద అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. దీనికి తోడు అందర్నీ కలుపుకు పోవాలనుకునే మనస్తత్వం చిరుది. పైగా కోపంలో కూడా శాంతంగా ఉండటం చిరు లక్షణం. అలాంటి చిరంజీవి ప్రస్తుతం […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 21, 2021 7:49 pm
    Follow us on

    Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే ఓ ప్రభంజనం అన్నట్టు ఊగిపోతుంటారు అభిమానులు. చిరంజీవి ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు. సినిమా వాళ్లకు ఏ కష్టం వచ్చినా ప్రస్తుతం వాళ్లకు కనిపిస్తున్న పెద్ద దిక్కు చిరంజీవి ఒక్కరే. మెగా అభిమానులు కూడా మెగాస్టార్ ను ఇండస్ట్రీ పెద్ద అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. దీనికి తోడు అందర్నీ కలుపుకు పోవాలనుకునే మనస్తత్వం చిరుది.

    Chiranjeevi

    Chiranjeevi

    పైగా కోపంలో కూడా శాంతంగా ఉండటం చిరు లక్షణం. అలాంటి చిరంజీవి ప్రస్తుతం కోపంగా ఉన్నారు. కొన్ని విషయాల్లో తన ప్రమేయం లేకుండా తన పై అనవసర కామెంట్స్ చేస్తున్నారని చిరు ఫీల్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏపీలో ఎదురవుతున్న సమస్యలకు కారణం.. చిరు వైఫల్యమే అంటూ కొందరు నిర్మాతల మధ్య ఆ మధ్య ఒక చర్చ జరిగిందట.

    నలుగురు సినిమా వాళ్లు ఓ చోట చేరి పార్టీ చేసుకుంటే.. ఆ పార్టీలో బోలెడు విషయాల పై అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందరి గురించి నెగిటివ్ గానే మాట్లాడతారు. అలా చిరు గురించి ఓ నిర్మాత కాస్త టంగ్ స్లిప్ అయ్యాడట. చిరు సరైన సమయంలో జగన్ పై ఒత్తిడి పెంచలేకపోయాడు అని కామెంట్స్ చేశాడట.

    మొత్తానికి ఆ మాటలన్నీ చిరు చెంతకు చేరాయి. ఆ నిర్మాత పెద్ద నిర్మాత. గతంలో చాలా భారీ చిత్రాలు తీశారు. ప్రస్తుతం కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాకపోతే, ఆయన వారసులు యాక్టివ్ గా ఉన్నారు. ఆయన కేవలం తన కుమార్తెలకు నిర్మాణంలో సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నారు. సినిమా పెద్ద దిక్కు అనే గౌరవం చిరుకు దక్కదు అనేది ఆయన గారి అభిప్రాయం.

    Also Read: Naga Chaitanya: సామ్ దూరమయ్యాక చైతులో ఈ మార్పు మంచిదే !

    పెద్ద దిక్కుగా సినిమా టికెట్ రేట్ల విషయంలో చిరంజీవి ఎప్పుడూ చొరవ చూపుతూనే వచ్చారు. అయితే ఆ చొరవ ఆ నిర్మాతకు నచ్చడం లేదు. ప్రభుత్వాలను డిమాండ్ చేయడంలో చిరంజీవి విఫలం అవుతున్నారని ఆ నిర్మాత మాట. జగన్ ను మొదటి నుంచీ చిరంజీవి డిమాండ్ చేయలేక, రిక్వెస్ట్ చేస్తున్నారని, అదే నష్టం చేసిందని ఆ నిర్మాత అంటున్నాడట. ఈ మాటలు చిరంజీవిని బాధ పెట్టాయి.

    Also Read: Akhil Akkineni: అఖిల్ పాన్ ఇండియా మోజు.. నాగ్ చేస్తాడా ?

    Tags