దీపికతో కాదు కియారాతో ప్రభాస్ రొమాన్స్‌!

మహేశ్ బాబు సరనన ‘భరత్‌ అనే నేను’తో టాలీవుడ్‌కు పరిచయమైంది హిందీ భామ కియారా అద్వానీ. ఫస్ట్‌ మూవీతోనే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్‌ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చేసినా ఆ మూవీ ఫ్లాప్‌ అయింది. దాంతో, టాలీవుడ్‌కు దూరమైన ఆమె బాలీవుడ్‌పైనే ఎక్కువ దృష్టి సారించింది. తెలుగు సూపర్ హిట్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్‌’తో బాలీవుడ్‌లో ఆమె స్టార్డమ్‌ తెచ్చుకుంది. ఓ […]

Written By: Neelambaram, Updated On : July 20, 2020 4:48 pm
Follow us on


మహేశ్ బాబు సరనన ‘భరత్‌ అనే నేను’తో టాలీవుడ్‌కు పరిచయమైంది హిందీ భామ కియారా అద్వానీ. ఫస్ట్‌ మూవీతోనే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్‌ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చేసినా ఆ మూవీ ఫ్లాప్‌ అయింది. దాంతో, టాలీవుడ్‌కు దూరమైన ఆమె బాలీవుడ్‌పైనే ఎక్కువ దృష్టి సారించింది. తెలుగు సూపర్ హిట్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్‌’తో బాలీవుడ్‌లో ఆమె స్టార్డమ్‌ తెచ్చుకుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో హిందీలో బిజీగా మారిందామె. ఇప్పుడామె మరోసారి టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. అదీ మామూలు సినిమాతో కాదు. బాహుబలి ప్రభాస్‌ సరసన నటించే బంపరాఫర్ అందుకున్నట్టు సమాచారం. ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రెబల్‌ స్టార్ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తాడని వినికిడి. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌… భారీ బడ్జెట్‌తో ఈ మూవీని ప్లాన్‌ చేస్తున్నాడు.

‘విరూపాక్ష’ కాదట.. ‘గజదొంగ’ లేదంటే ‘బందిపోటు’!

తెలుగు, హిందీ సహా నాలుగైదు భాషల్లో వచ్చే ఈ మూవీలో ప్రభాస్‌ సరసన్‌ నోటబుల్‌ హీరోయిన్‌ను ఎంచుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకోసం ఇప్పటికే దీపికా పదుకోన్‌ను సంప్రదించారు. ఆమె ఓకే చెప్పినా.. భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. దాంతో పాటు హిందీ హక్కుల్లో కూడా అడిగిందట. దాంతో, చిత్ర బృందం వేరే హీరోయిన్‌ వేటలో పడిందని, ఈ క్రమంలో కియారాను ఎంచుకోవాలని డిసైడైనట్లు టాలీవుడ్‌ టాక్‌. దీపిక అంత కాకున్నా.. కియారా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అక్షయ్‌ కుమార్ సరసన ఆమె హీరోయిన్‌గా నటించిన ‘లక్ష్మీబాంబ్‌’ ఓటీటీలో తర్వలోనే రిలీజ్‌ కానుంది. అది హిట్టయితే కియారాకు మరింత పేరు రావడం ఖాయం. ఈ నేనథ్యంలో కియారాను తీసుకుంటే హిందీ మార్కెట్‌ కూడా ప్లస్‌ అవుతుందని నాగ్‌ అశ్విన్ భావిస్తున్నాడట. దీనిపై తొందర్లోనే ప్రకటన వచ్చే చాన్సుందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.