Actor Narayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినిమా బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చి హీరో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే అప్పట్లో నాటకాలలో నటించి ఆ అనుభవంతోనే సినిమాలలోకి వచ్చిన వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అప్పట్లో ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలలో వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు పి ఎల్ నారాయణ. నారాయణ మలయాళ కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ ఈయన గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఇక అక్కడే తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత నారాయణ వరంగల్ ప్రజానాట్యమండలి ద్వారా కుక్క అనే ఒక నాటకాన్ని రాశారు. ఈ నాటకానికి జాతీయ అవార్డు రావడంతో నారాయణకు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఇలా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నారాయణ లాయర్, బడిపంతులు, రాజకీయ నేత, కార్మిక నేత, బిక్షగాడు ఇలా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు తమిళ్ తో కలిపి ఈయన 300కు పైగా సినిమాలలో నటించారు. అయితే పి ఎల్ నారాయణ కుటుంబం నుంచి ఒక టాప్ హీరోయిన్ కూడా మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉందన్న సంగతి చాలామందికి తెలియదు అని చెప్పాలి. ఈ హీరోయిన్ మరెవరో కాదు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ భార్య ఊహ. పి ఎల్ నారాయణ హీరోయిన్ ఊహకు స్వయానా మేనమామ అవుతారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు.
ఇక ఊహ సినిమాల విషయానికొస్తే ఈమె తమిళ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈమె అసలు పేరు శివరంజిని. తమిళ్ లో 20 కు పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత ఊహ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈవివి సత్యనారాయణ ఊహను ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సమయంలో శివరంజని అనే పేరును మార్చి ఊహగా పరిచయం చేశారు. ఆ తర్వాత ఊహ హీరో శ్రీకాంత్ కు జంటగా ఎక్కువ సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు ఉన్నారు. టాలీవుడ్ లో ఊహ చాలా సినిమాలలో నటించినప్పటికీ మొదటి సినిమా మరియు ఆమె చివరి సినిమా హీరో శ్రీకాంత్ తో చేయడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హీరో శ్రీకాంత్ కొడుకు కూడా సినిమాలలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక శ్రీకాంత్ కూతురు గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవి చిన్ననాటి పాత్రలో నటించింది. ఇక హీరో శ్రీకాంత్ కూడా టాలీవుడ్ లో హీరోగా మాత్రమే కాకుండా వివిధ క్యారెక్టర్లలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ ను సొంతం చేసుకున్నారు.