https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 సినిమా అక్కడ ప్లాప్ అవ్వడానికి ఆ ఒక్క సీన్ కారణమనే విషయం మీకు తెలుసా..? ఇంతకీ ఆ సీన్ ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక హీరో అల్లు అర్జున్... 'పుష్ప 2' సినిమాతో ఆయన పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 31, 2024 / 04:59 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక హీరో అల్లు అర్జున్… ‘పుష్ప 2’ సినిమాతో ఆయన పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు. ఇక రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి 2’ సినిమా రికార్డును కూడా కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు…మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతూ ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక భారీ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. నిజానికి ఆయన చేసిన పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకొని స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి రికార్డును బ్రేక్ చేయడానికి దగ్గర్లో ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా కూడా మారబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకొని తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకున్న అల్లు అర్జున్ రాబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పుష్ప 2 సినిమాలో ఒక సీన్ అనవసరంగా పెట్టారు. ఆ సీన్ లేకపోతే బాగుండేది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటి అంటే భన్వర్ సింగ్ షేకావత్ స్విమ్మింగ్ పూల్ లో పడినప్పుడు అల్లు అర్జున్ అందులో మూత్రం పోయడం అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుందట…

    దానివల్ల సినిమా మీద భారీగా నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా అది సినిమాలో ఒక పార్ట్ గా మాత్రమే మనం చూడాలని దాన్ని ఉద్దేశించి మనం ఎలాంటి పర్సనల్ ఒపీనియన్స్ ని తీసుకోకూడదంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    అయితే కేరళలో మల్లు అర్జున్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కారణం ఏంటి అంటే మలయాళం నటుడు అయిన ఫాహద్ ఫజిల్ ను ఈ సినిమాలో చాలా దారుణంగా చూపించారు అంటూ స్విమ్మింగ్ పూల్ సీన్ ను వాళ్ళు ఊహించుకోలేకపోతున్నాం అంటూ కొన్ని కామెంట్లను కూడా పెడుతున్నారు.

    మరి దాని వల్లే ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు సాగుతూ ఉండడం విశేషమనే చెప్పాలి…