‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవుతున్న ‘ఆచార్య’.!

కరోనా ఎఫెక్ట్ తో షూటింగులన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో సినిమా షూటింగులు మొదలవుతున్నాయి. దీంతో స్టార్ హీరోలు, నటీనటులంతా షూటింగులకు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే సీనియర్ హీరోల చిత్రాలు మాత్రం ఇప్పట్లో పట్టాలెక్కలా కన్పించడం లేదు. Also Read: మరోసారి గొప్పతనం చాటుకున్న హీరో మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్లోని సీనియర్ హీరోలు కొనసాగుతున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వయస్సు 60ఏళ్లు పైబడే ఉంటాయి. ఇందులో నాగార్జున ఒక్కడే ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ […]

Written By: NARESH, Updated On : October 18, 2020 4:46 pm
Follow us on

కరోనా ఎఫెక్ట్ తో షూటింగులన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో సినిమా షూటింగులు మొదలవుతున్నాయి. దీంతో స్టార్ హీరోలు, నటీనటులంతా షూటింగులకు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే సీనియర్ హీరోల చిత్రాలు మాత్రం ఇప్పట్లో పట్టాలెక్కలా కన్పించడం లేదు.

Also Read: మరోసారి గొప్పతనం చాటుకున్న హీరో మహేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్లోని సీనియర్ హీరోలు కొనసాగుతున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వయస్సు 60ఏళ్లు పైబడే ఉంటాయి. ఇందులో నాగార్జున ఒక్కడే ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం ఇటీవల కులుమానాలి వెళ్లాడు. అయితే మిగతా హీరోలు మాత్రం షూటింగుల విషయంలో ఆచితుచి అడుగులు వేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి(65) వయస్సు ప్రభావం కారణంగా షూటింగులకు ఇప్పట్లో వెళ్లేలా కన్పించడంలేదు. ఇటీవల ఇండస్ట్రీలో చాలా మంది కరోనా బారినపడి కోలుకున్నారు. దర్శకుడు రాజమౌళి.. సంగీత దర్శకుడు కీరవాణి కరోనా బారినపడి కోలుకున్నారు. అయితే ఇటీవల రాజమౌళి కరోనా నిబంధనలు పాటిస్తూ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగును హైదరాబాద్లో ప్రారంభించాడు.

‘ఆర్ఆర్ఆర్’ షూటింగు కోసం రాజమౌళి తొలుత టెస్ట్ షూట్ చేశాడు. అనంతరం షూటింగ్ ప్రారంభించాడు. పరిస్థితులు సజావుగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ముఖ్య నటీనటులతో రాజమౌళి షూటింగ్ కు సిద్ధమయ్యాడు. దీంతో ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల సైతం తొలుత టెస్ట్ షూట్ చేసేందుకే మొగ్గుచూపుతున్నాడు.

అంతా బాగుంటేనే చిరంజీవిని సెట్స్ లోకి ఆహ్వానించాలని కొరటాల భావిస్తున్నాడు. చిరు-చరణ్ కు సంబంధించిన సీన్స్ తెరకెక్కించేందుకు దర్శకుడు కొరటాల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాడు. పరిస్థితులు అనుకూలిస్తే నవంబర్లో సినిమా షూటింగు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది.

Also Read: రోజారమణి, చక్రపాణి గార్లకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కరం

చిరుకు జోడీగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్లో ఉండటంతోనే ఆమె షూటింగ్ కోసం నవంబర్ చివర్లో డేట్స్ కేటాయించిందట. దీంతో ఆమె నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్లో షూటింగులో పాల్గొంటుందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతానికి ‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగు నవంబర్లో ప్రారంభిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!