సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కమర్షియల్.. డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే మరోవైపు మహేష్ బాబు ఎవరికీ తెలియకుండా గుప్తదానాలు చేస్తుంటాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకునేందుకు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. ఇక చిన్నారులను ఆదుకోవడంలో మహేష్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాడు.
Also Read: హీరో రామ్ స్ట్రామినా పెరిగింది.. నిర్మాతల్లో ఏంటీ మార్పు?
తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. భూకంపాలు సంభవించినపుడు మహేష్ బాబు తనవంతు సాయం అందించి ఆదుకున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం లాంటివి చేస్తున్నాడు. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ ఛారిటీకి కోటి రూపాయాల సాయం అందించాడు. మీడియాకు తెలియకుండా మహేష్ బాబు ఎన్నో గుప్తదానాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు.
గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ బాబు వైద్యం చేయిస్తూ ఆదుకుంటున్నాడు. గత మూడేళ్లలో మహేష్ బాబు వెయ్యిమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి ఆ కుటుంబాల్లో చిరుదీపం వెలిగించాడు.
ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ‘మరో రెండు గుండెలు మా కుటుంబంతో కలిశాయి.. ఇటీవల గుండె ఆపరేషన్స్ చేయించుకున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం..’ అంటూ ఇన్ స్ట్రాలో పోస్టు పెట్టింది.
Also Read: రోజారమణి, చక్రపాణి గార్లకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కరం
అేదేవిధంగా చిన్నారులకు వైద్య అందించిన ఆంధ్రా, లిటిల్ హార్ట్స్ ఆసుప్రతులకు ధన్యవాదాలు’ అంటూ నమ్రత ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.