సైలెంట్‌గా సైడ్‌ అయిపోయిన నారాయణ.. ఏమైంది?

టీడీపీ అధినేత చంద్రబాబు.. నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ నారాయణల మధ్య అనుబంధం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియనిది కాదు. నారాయణ అటు విద్యాసంస్థల చైర్మన్‌గా ఉంటూనే.. ఇటు టీడీపీకీ ఆర్థిక అవసరాలు తీర్చే వ్యాపారవేత్తగా మారిపోయారు. అలాంటి వ్యాపార వేత్త మెల్లమెల్లగా రాజకీయాల వైపు మళ్లారు. చంద్రబాబు ఏపీలో అధికారం చేపట్టగానే ఎమ్మెల్సీ పదవితో ఏకంగా మంత్రి అయిపోయారు. ఏకంగా పార్టీలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగిపోయారు. ఎంతలా అంటే.. అమరావతి రాజధాని అంశంలోనూ ఆయన చెప్పిన […]

Written By: NARESH, Updated On : October 18, 2020 4:44 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు.. నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ నారాయణల మధ్య అనుబంధం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియనిది కాదు. నారాయణ అటు విద్యాసంస్థల చైర్మన్‌గా ఉంటూనే.. ఇటు టీడీపీకీ ఆర్థిక అవసరాలు తీర్చే వ్యాపారవేత్తగా మారిపోయారు. అలాంటి వ్యాపార వేత్త మెల్లమెల్లగా రాజకీయాల వైపు మళ్లారు. చంద్రబాబు ఏపీలో అధికారం చేపట్టగానే ఎమ్మెల్సీ పదవితో ఏకంగా మంత్రి అయిపోయారు. ఏకంగా పార్టీలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగిపోయారు. ఎంతలా అంటే.. అమరావతి రాజధాని అంశంలోనూ ఆయన చెప్పిన మాటే చెల్లుబాటైంది. సీఆర్డీఏ వ్యవహారాలన్నీ అన్నీ తానై నడిపారు.

Also Read: పగబట్టినట్లే వానలు.. ఎందుకిలా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. ఎమ్మెల్సీ పదవి ఉండగానే అతి నమ్మకంతో గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు. కానీ.. ఓటర్లు మాత్రం ఫలితం వేరేలా ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమితో నారాయణ కనిపించకుండా పోయారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవడం లేదు. కనీసం సొంత ఊరైన నెల్లూరులో ఏ కార్యక్రమానికీ హాజరు కావడం లేదు.

నారాయణ టీడీపీకి దూరం కావడంపైనా ఓ వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీకి టార్గెట్‌ కావద్దని ఆయన ఆలోచనకు వచ్చారట. చంద్రబాబు, నారాయణల మధ్య పలు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. అమరావతి భూముల వ్యవహారంలోనూ ఇద్దరికీ చాలా లావాదేవీలున్నాయి. దీంతో ఆయన బాబుని, చినబాబుని వదిలిపెట్టి పోయే పరిస్థితి కూడా లేదు.

ముఖ్యంగా ఇప్పుడు నారాయణ తన విద్యాసంస్థల మీదనే ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నట్లు రాజకీయ వర్గాల టాక్‌. పోటీ సంస్థ శ్రీచైతన్యతో కలిసి అప్పట్లో చైనా బ్యాచ్‌ చైతన్యనారాయణ నడిపినా.. ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. దీంతో నారాయణ హవా తగ్గింది. దీంతో 2019 ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా వ్యాపారాలకే పరిమితమయ్యాడు. రాజకీయ నాయుకులను కూడా ఎవరినీ తన దగ్గరకు రానీయడంలేదు. రాజకీయాలు కూడా మాట్లాడడం లేదు. కేవలం నెల్లూరు రాజకీయాల్లో మాత్రం తన అనుకున్న వారికి పదవులు ఇప్పించేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారట అంతే.

Also Read: జగన్ లేఖ.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సెకండ్‌ లీడర్‌‌లా మెయింటెన్‌ చేసిన నారాయణ.. ఇప్పుడు సైలెంట్ అయిపోవడంపై విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కేవలం వైసీపీ భయపడే.. తన వ్యాపార సామ్రాజ్యానికి ఎక్కడ నష్టం కలుగుతుందోననే బెంగతోనే ఇలా సైడ్‌ అయిపోయినట్లుగా తెలుస్తోంది.