అక్షయ్ కుమార్ ఒక అడుగు ముందే ఉంటాడు

అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి షహాయ నిధి ” పీఎం కేర్స్ ఫండ్ ” కి పాతిక కోట్లు ఇవ్వడం దేశం మొత్తాన్ని నివ్వెర పరిచింది. ఇంకా చెప్పాలంటే టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యింది. బాలీవుడ్ నుంచి విరాళాల విషయంలో ఎవరు స్పందించడం లేదు అనుకొంటున్న సమయం లో అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో పాతిక కోట్లు ఇచ్చి మిగతా స్టార్లను ఇరకాటంలో పెట్టేశాడు. నిజానికి అక్షయ్ కుమార్ ఇలా సొసైటీ కోసం ముందుకు రావడం […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 3:08 pm
Follow us on

అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి షహాయ నిధి ” పీఎం కేర్స్ ఫండ్ ” కి పాతిక కోట్లు ఇవ్వడం దేశం మొత్తాన్ని నివ్వెర పరిచింది. ఇంకా చెప్పాలంటే టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యింది.

బాలీవుడ్ నుంచి విరాళాల విషయంలో ఎవరు స్పందించడం లేదు అనుకొంటున్న సమయం లో అక్షయ్ కుమార్ భారీ మొత్తంలో పాతిక కోట్లు ఇచ్చి మిగతా స్టార్లను ఇరకాటంలో పెట్టేశాడు.

నిజానికి అక్షయ్ కుమార్ ఇలా సొసైటీ కోసం ముందుకు రావడం ఇది మొదట సారి కాదు. గతం లో కూడా ఇలాగే భారీగా విరాళాలు అందించాడు. రెండేళ్ల కిందట పుల్వామా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన సైనిక కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళం అందించి అందరికి ఆదర్శం అయ్యాడు. అలాగే అస్సాం వరద బాధితుల కోసం రూ.2 కోట్లిచ్చాడు. దక్షిణాదిన చెన్నైలో వరదలొస్తే కోటి రూపాయలిచ్చాడు. ఇక సీఆర్పీఎఫ్ కుటుంబాలకు రూ.1.08 కోట్లు.. శానిటైజేషన్ మీద అవగాహన నిధికి రూ.1.5 కోట్లు.. ఇలా అక్షయ్ కుమార్ ఎన్నోసార్లు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అంతేకాదు మన దేశం లోని సైనిక కుటుంబాల కోసం ‘భారత్ కే వీర్’ ఫౌండేషన్ స్థాపించాడు. ఇలా చెప్పుకొంటూ పొతే అక్షయ్ కుమార్ దాతృత్వానికి అంటే ఉండదు. there is no count for oxyzen