Pawan Kalyan: చిరంజీవి నటవారసుడిగా వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగారు. దేశంలోనే అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగి హీరోల్లో ఒకరయ్యారు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు పవన్ కి భక్తులు ఉంటారని అభిమానులు సగర్వంగా చెప్పుకుంటారు. ఆయన్ని పిచ్చిగా అభిమానించే వారు లక్షల్లో ఉన్నారు. పవన్ కళ్యా ప్లాప్ సినిమా ఓపెనింగ్స్ కూడా ఆల్ టైం రికార్డు సృష్టిస్తాయి. ఆయన బాక్సాఫీస్ స్టామినా అంచనా వేయడం కష్టం. మరి ఇంత పెద్ద స్టార్ సినిమా ఎంట్రీ నాటకీయంగానే జరిగింది. పవన్ ని హీరో గా పరిచయం చేద్దామనుకున్న సినిమా మూడేళ్లు అయినా పట్టాలెక్కలేదట. దీంతో పవన్ నిరాశకు గురయ్యారు.

ఇదంతా అయ్యేది కాదనుకున్న పవన్, బెంగుళూరు వెళ్లి నర్సరీ స్టార్ట్ చేస్తానని ఇంట్లో చెప్పారట. నాకు తెలిసిన పని అదొక్కటేనని అందరినీ ఒప్పించారట. అనూహ్యంగా అదే రోజు పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ సన్నాహాలు మొదలయ్యాయనే సమాచారం అందిందట. దాంతో బెంగుళూరు వెళ్లాలన్న పవన్ ఆలోచనకు బ్రేక్ పడింది. ఫస్ట్ సినిమా కూడా ఆయన మొక్కుబడిగా చేశారట. అదే తన చివరి సినిమా కావాలి అనుకున్నారట. విధిని ఎవరూ మార్చలేరు. పవన్ టాలీవుడ్ ని శాసించాలని రాసి ఉంటే బెంగుళూరు నర్సరీ ఆలోచన ఎలా కార్యరూపం దాల్చుతుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ మొదటి చిత్రం. ఆ తర్వాత గోకులంలో సీత ఆఫర్ వచ్చింది. అప్పటి కూడా పవన్ యాక్టింగ్ సీరియస్ గా తీసుకోలేదట.
Also Read: Hari Hara Veera Mallu- Power Glance: తొడగొట్టాడు.. తెలుగోడు.. హరిహర వీరమల్లుగా పవన్ విశ్వరూపం
చేసే పని ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి. విజయాలు కాదు ప్రయాణం ముఖ్యమని అర్థం చేసుకున్న పవన్ సినిమా రంగంపై ఫోకస్ పెట్టాడు. సుస్వాగతం మూవీతో ఫస్ట్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి చిత్రాలతో స్టార్ హోదా దక్కించుకున్నాడు. చిరంజీవి తమ్ముడిగా వచ్చినప్పటికీ పవన్ తనదైన శైలీ, మేనరిజం డెవలప్ చేసుకున్నారు. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఆచితూచి సినిమాలు చేసే పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల కెరీర్ లో చేసింది 27 చిత్రాలు మాత్రమే.

ఖుషి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రయోగాలకు తెరలేపారు. స్వీయ దర్శకత్వంలో జానీ మూవీ తెరకెక్కించారు. గొప్ప కంటెంట్ తో తెరకెక్కిన జానీ కమర్షియల్ గా ఆడలేదు. జానీ తర్వాత కూడా పవన్ సినిమాలకు దూరం కావాలి అనుకున్నారట. ఓ దశలో ఆయన గడ్డుకాలం ఎదుర్కొన్నారు. వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు. అయితే ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా పవన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన స్టార్ డమ్ పెరుగుతూ వచ్చింది.
Also Read:Pawan Kalyan Remakes: పవన్ కల్యాణ్ కెరీర్ లో రీమేక్ హిట్స్..
[…] […]
[…] […]