China Rice Plants Zero-Gravity: భూమిపై వ్యవసాయం చేయడానికి ఆపసోపాలు పడుతున్న రోజులి. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులెదరవుతున్న తరుణంలో సాగు కష్టతరంగా మారుతోంది. ప్రపంచంలో రోజురోజుకూ వ్యవసాయం చేసేవారు తగ్గముఖం పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రపంచానికి చైనా గట్టి సందేశమే పంపింది. అంతరిక్షంలో వరితో పాటు ఇతర పంటలను విజయవంతంగా సాగుచేసింది. ఏకంగా అంతరిక్ష కేంద్రంలోనే పంటలను పండించారు. ఈ విషయాలు బయటకు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చైనా. అగ్రదేశం చైనా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు కొలిక్కి వస్తున్నాయి. ఇంతలో టైమ్ వేస్ట్ చేయడం ఎందుకో? అని అనుకుందేమో కానీ.. సైన్స్ ప్రయోగాలను చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా జీరో గ్రావిటీ ల్యాబ్ లో ఏకంగా వరి మొక్కలను విజయంవంతంగా సాగుచేసింది. అవి పెరిగి ఉత్పత్తినిచ్చే స్థాయికి మొక్కలు పెరిగాయి. ఈ విషయాన్ని చైనీస్ అకడమీ ఆఫ్ సైన్స్ తన లైఫ్ సైన్స్ పరిశోధనల్లో వెల్లడించింది.

రెండు నెలల కిందట నుంచే..
జూలై లో ప్రయోగాన్ని ప్రారంభించిన చైనా రెండు నెలల వ్యవధిలోనే పూర్తిచేసింది. రెండు రకాలైన విత్తనాలపై ఆ ప్రయోగం చేసింది. క్యాబేజీతో పాటు వరి విత్తనాలపై ప్రయోగం చేసి స్పేస్ స్టేషన్ లోని వెబియన్ ల్యాబులో వాటి పెంచింది. చైనా వ్యోమోగాములు ప్రత్యేక శ్రద్ధ కనబరచి అంతరిక్షంలో కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి మరీ పంటలను విజయవంతంగా సాగుచేయడం ఆసక్తి గొల్పుతోంది. అయితే ప్రస్తుతానికి తక్కువ అంటే మొక్కలు స్థాయిలో క్యాబేజీ, వరి పంటలపై చేసిన ఈ ప్రయోగం భవిష్యత్లో ఇతర పంటల సాగు అధ్యయనానికి మాత్రం ఎంతగానో ఉపకరిస్తుందని చైనా వ్యోమోగాములు చెబుతున్నారు. రేడియేషన్ స్థాయిలు అధికంగా ఉండే అంతరిక్షంలో మొక్కలు ఏ విధంగా ఉంటాయి? అనేది తెలుసుకునేందుకే ప్రయోగం చేసినట్టు వారు చైనా పేర్కొంది. అయితే తాము ఊహించినట్టు కాకుండా 30 సెంటీమీటర్ల మేర మొక్కలు ఎదిగినట్టు వ్యోమోగాములు చెబుతున్నారు.
Also Read: Aadhaar Card Themed Ganesh pandal: దేవుడికే ఆధార్ కార్డు ఇచ్చేశారు

గత ఏడాదిలో..
అయితే చైనా పంటల ప్రయోగం ఇప్పటిది కాదు. గత ఏడాది జూలైలో కూడా ఇదే విధంగా అంతరిక్షంలో మొక్కలు పెంచేందుకు ప్రయత్నించింది. చాంగ్ 5 అనే మిషన్ తో వ్యోమోగామి బృందం వరి మొక్కలను పెంచే ప్రయత్నం అయితే అప్పట్లోనే చేసింది. కానీ తాజాగా వరి, క్యాబేజీ మొక్కల పెంపకం విజయవంతం కావడంతో చైనీస్ అకడమీ ఆఫ్ సైన్స్ ఒక వీడియోను విడుదల చేసింది. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భూమిలో కృత్రిమంగా పంటలు సాగుచేయవచ్చని..కానీ మైక్రో గ్రావిటీలో మొక్కల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపైనే చైనా దృష్టిసారించినట్టు ఆ దేశ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికైతే సమీప భవిష్యత్ లో చైనా అంతరిక్షంపై అన్నదానం చేయనుందన్న మాట.
Also Read:Pawan Kalyan Remakes: పవన్ కల్యాణ్ కెరీర్ లో రీమేక్ హిట్స్..
[…] Also Read: China Rice Plants Zero-Gravity: చైనా చేసిన అద్భుతం.. అంతరి… […]