https://oktelugu.com/

Aishwarya Rai: రహస్యంగా పెళ్లి చేసుకున్న ఐశ్వర్యరాయ్..హనీమూన్ కోసం న్యూయార్క్..ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అవ్వడంతో ఐశ్వర్య రాయ్ వరకు విషయం వెళ్ళింది. దీంతో వెంటనే స్పందించిన ఐశ్వర్య రాయ్ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఎవరినో రహస్యంగా పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు, మీడియా లో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 05:25 PM IST

    Aishwarya Rai

    Follow us on

    Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ని ఇష్టపడని వారంటూ ఉంటారా..?, ఏ అబ్బాయికి అయినా ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి భార్య రావాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా తమకొడుక్కి ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఆమె అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్న రోజు కోట్లాది మంది యువకుల హృదయాలు బద్దలయ్యాయి. అందానికి పర్యాయపదం లాంటి ఐశ్వర్యరాయ్ డేట్స్ కోసం అప్పట్లో హీరోలు క్యూలు కట్టేవారు. దర్శక నిర్మాతలకు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ డేట్స్ అయినా దొరికేవేమో కానీ ఐశ్వర్య రాయ్ డేట్స్ మాత్రం దొరికేవి కాదు. ఆ స్థాయి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఈమె. అయితే అప్పట్లో ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరేమో. ఆరోజుల్లో మీడియా వీళ్లిద్దరి గురించి ఎన్నో కథనాలు ప్రసారం చేసేది. ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, వీళ్లిద్దరు హనీమూన్ కోసం న్యూయార్క్ కి కూడా వెళ్లారని, సల్మాన్ ఖాన్ కోసం ఆమె తన మతాన్ని కూడా మార్చుకుంటుందని ఇలా ఎన్నో రకాల ప్రచారాలు చేసారు.

    ఇది అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ అవ్వడంతో ఐశ్వర్య రాయ్ వరకు విషయం వెళ్ళింది. దీంతో వెంటనే స్పందించిన ఐశ్వర్య రాయ్ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఎవరినో రహస్యంగా పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు, మీడియా లో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. నేను పెళ్లి చేసుకుంటే నేరుగా, అందరి ముందే పెళ్లి చేసుకుంటాను. రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్ళకు ఆమె 2007 వ సంవత్సరంలో అభిషేక్ బచ్చన్ ని పెళ్ళాడి అందరినీ షాక్ కి గురి చేసింది. వీళ్లిద్దరికీ ‘ఆద్య’ అనే పాప కూడా ఉంది. ఈ పాపకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో అందుబాటులోనే ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోయారంటూ సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

    ఐశ్వర్య రాయ్ ఒంటరిగా విదేశాలకు వెళ్లినా, ఏదైనా పెళ్లి ఫంక్షన్ లో కాసేపు అభిషేక్ బచ్చన్ తో కాకుండా ఒంటరిగా కనిపించినా వీళ్లిద్దరు విడిపోయారంటూ బాలీవుడ్ మీడియా ఒక రేంజ్ లో ప్రచారం చెయ్యడం మొదలు పెట్టింది. ఇలాంటి వార్తలను విని విసిగిపోయిన అభిషేక్ బచ్చన్ దీనిపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఐశ్వర్య రాయ్ నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు, ఆమెని నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆమెకి తెలుసు, మేమిద్దరం మా బంధం గురించి ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అంటూ అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఈ రూమర్స్ కి కాస్త వరకు బ్రేక్ పడింది.