Ravi Teja: డైరెక్టర్ గా రవితేజ మొదటి సినిమా అతనితోనే..త్వరలోనే అధికారిక ప్రకటన!

తన డ్యూటీ ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తాడు కానీ, డైరెక్టర్స్ అప్పుడప్పుడు తడబడతారు. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు రవితేజ. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే బోయపాటి శ్రీను, బాబీ, శ్రీను వైట్ల, పరశురామ్ పెట్ల, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ ఇలా ఎంతో మంది టాలెంట్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి దొరుకుతారు.

Written By: Vicky, Updated On : August 19, 2024 5:30 pm

Ravi Teja

Follow us on

Ravi Teja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వేసుకుంటూ, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, మాస్ మహారాజా గా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన నటుడు మాస్ మహారాజా రవితేజ. కొత్తగా ఎదో ఒకటి సాధించాలి, సినీ ఇండస్ట్రీ లో రాణించాలి అని అనుకునే ప్రతీ ఒక్కరికి రవితేజ ఒక రోల్ మోడల్ లాంటోడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపించినంత సేపు, ఒక ఎనర్జీ ఉంటుంది. పెద్దగా కంటెంట్ లేని సన్నివేశాలను యాక్టింగ్ టాలెంట్ తో పైకి లేపడం రవితేజ కి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి సినిమాలోనూ తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేసేందుకు రవితేజ ఎంతో కష్టపడతాడు.

తన డ్యూటీ ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తాడు కానీ, డైరెక్టర్స్ అప్పుడప్పుడు తడబడతారు. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు రవితేజ. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే బోయపాటి శ్రీను, బాబీ, శ్రీను వైట్ల, పరశురామ్ పెట్ల, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ ఇలా ఎంతో మంది టాలెంట్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి దొరుకుతారు. కానీ ఈమధ్య కొత్తవాళ్ళని నమ్మి రవితేజ అవకాశాలు ఇస్తుంటే వాళ్ళు ఆయనకీ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ పెట్టేంత సత్తా ఉన్న రవితేజ మార్కెట్ ని వీళ్లంతా కలిసి చెత్త సినిమాలు తీసి, ఆయన మొదటి రోజు ఓపెనింగ్ మార్కెట్ ని కేవలం నాలుగు కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితం చేసారు. ఇది ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశ కలిగించే విషయం. తనకి ‘మిరపకాయ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన హరీష్ శంకర్ తో రీసెంట్ గానే రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రం చేసి గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. నేడు ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ హరీష్ శంకర్ మీడియా కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూ లో రవితేజ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రవితేజ గతంలో పలు ఇంటర్వ్యూస్ లో దర్శకత్వం కచ్చితంగా చేస్తాను, కానీ ఆ సినిమాలో నేను నటించను అని చెప్పుకొచ్చాడు. నేడు ఆ విషయాన్ని హరీష్ శంకర్ గుర్తు చేస్తూ, రవితేజ గారు త్వరలో ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు, అందులో నాకు కూడా ఒక పాత్ర కచ్చితంగా ఉంటుందని చెప్పాడు అంటూ హరీష్ శంకర్ మాటాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరి రవితేజ ఎప్పుడు దర్శకత్వం వహిస్తాడు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.