https://oktelugu.com/

AAY Movie Review : ఆయ్ ఫుల్ మూవీ రివ్యూ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ కి చెందిన అమ్మాయిని ప్రేమించిన కార్తీక్(నార్నే నితిన్) ఎలాగైనా సరే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆ ఫ్యాక్షన్ ఫ్యామిలీని ఎదిరించి

Written By:
  • Gopi
  • , Updated On : August 16, 2024 8:39 am
    AAY Movie Review and Rating In telugu

    AAY Movie Review and Rating In telugu

    Follow us on

    AAY Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలతో చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘ఆయ్ ‘ అనే కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సినిమాలో ఆయన ఎలా నటించాడు? ఆ పాత్ర ఆయనకు సెట్ అయిందా? ఇక ఫ్యూచర్లో తను స్టార్ హీరో గా ఎదిగే అవకాశాలు ఉన్నాయా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ కి చెందిన అమ్మాయిని ప్రేమించిన కార్తీక్(నార్నే నితిన్) ఎలాగైనా సరే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆ ఫ్యాక్షన్ ఫ్యామిలీని ఎదిరించి తమ ఫ్రెండ్స్ తనకు పెళ్లి చేశారా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయాన్నికొస్తే సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికీ దర్శకుడు అంజి ఈ సినిమాని చాలా వరకు ఎంగేజ్ చేసే విధంగా సీన్లను రాసుకున్నాడు. ప్రతి సీన్ లో కూడా సినిమా తాలూకు ఇంటెన్స్ ను చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సీన్ లో ఏదో ఒక పాయింట్ ను చెప్పడం అనేది ప్రేక్షకుడి కి విపరీతంగా నచ్చింది. నార్నె నితిన్ గ్యాంగ్ చేసిన కామెడీకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుతాడనే చెప్పాలి. అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ రోటీన్ గా ఉన్నప్పటికీ అవి సినిమాలో భాగం కావడం వల్ల ఒక ఫ్లో లో అయితే ముందుకు కదులుతాయి…

    కానీ దర్శకుడు తను ఏదైతే నమ్మాడో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో తను సక్సెస్ కూడా అయ్యాడు. ఇక ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తో సినిమా చేయడం అనేది నిజంగా మంచి విషయమనే చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లిన దర్శకుడు కామెడీ సీన్లతో నింపేసాడు. సెకండ్ హాఫ్ లో కూడా కామెడీని ఎక్కువగా పండించినప్పటికీ ఎమోషన్ తో కూడా ప్రేక్షకులను కంటతడి పెట్టించేశాడు… ఎమోషన్ కామెడీ రెండు వర్కౌట్ అయితే సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనడానికి ఈ సినిమాను ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా ప్రేక్షకుడిని విపరీతంగా ఎంటర్టైన్ చేయడానికి తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది.

    అందువల్ల ఈ సినిమాలోని ప్రతి పాయింట్ కూడా చాలా లైట్ వెయిట్ తో ఉన్నప్పటికీ అందులో డెప్త్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలావరకు ప్లస్ అయింది. ఇక ఇది చాలా ఫ్రెష్ మ్యూజిక్ గా అనిపించడం అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా మ్యూజిక్ అనేది కీలకపాత్ర వహించడం వల్ల ఈ సినిమా యూత్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టు కూడా పూర్తి ఎఫెర్ట్ పెట్టి నటించాడు. ముఖ్యంగా నార్నె నితిన్ అయితే మొదటి సినిమా మ్యాడ్ లో ఎలాంటి హావాభావాలను ప్రకటించాడో ఈ సినిమాలో అంతకుమించి నటించాడనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆయన గోదావరి యాసలో మాట్లాడడం కూడా చాలా బాగా సెట్ అయింది. ఈ సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ ఆయనకి కెరియర్ పరంగా కూడా చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. అయితే ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తో కూడా భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఇక నార్నే నితిన్ తోపాటు గా చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య నితిన్ కి బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల కామెడీ సీన్స్ టాప్ రేంజ్ లో అయితే ఉన్నాయనే చెప్పాలి… ఇక ‘నయన సారిక’ కూడా తన పాత్రలో చాలా వరకు నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఈ సినిమాలో నటించిన నటి నటులు కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యారు. అలాగే మైమ్ గోపి పోషించిన పాత్ర ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిందనే చెప్పాలి…

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికొస్తే మొదటిగా మ్యూజిక్ గురించి తీసుకున్నట్టయితే రామ్ మిరియాల అందించిన సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక ప్రతి సీన్ లో ఉన్న ఇంటెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో మ్యూజిక్ అయితే చాలా వరకు ప్లస్ అయిది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కి చాలా అద్భుతంగా కుదిరింది… ఇక సినిమాటోగ్రాఫర్ అయిన సమీర్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో చాలా మంచి విజువల్స్ అందించాడు. దీనివల్ల సినిమాకి చాలా గ్రాండీయర్ లుక్ అయితే వచ్చింది… ఇక కోదటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పనితనం కూడా చాలావరకు ప్లస్ అయింది. ప్రతి సీన్ ని ఎంత లెవెల్ లో కట్ చేయాలో అక్కడి వరకే కట్ చేసి సీన్ల ను లాగ్ అవ్వకుండా చూసుకున్నాడు…

    ప్లస్ పాయింట్స్

    నార్నే నితిన్…
    డైరెక్షన్
    కామెడీ సీన్స్

    మైనస్ పాయింట్స్

    రోటీన్ కథ…
    ఒకే ప్లాట్ పాయింట్ లో వెళ్ళడం…

    రేటింగ్
    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    మంచి కామెడీ ఎంటర్ టైనర్ ప్రతి ఒక్కరూ ఒక్కసారి చూడవచ్చు…

    #AAY Theatrical Trailer | Narne Nithiin, Nayan Sarika | Anji K | #AAYMovie #AAYPremiersonAUG15