https://oktelugu.com/

Zodiac signs : మూడు గ్రహాల కలయికతో ఈ రాశుల వారి పంట పండినట్లే..! వద్దన్నా ధనం..

మూడు గ్రహాల కలయిక వల్ల మేషరాశి వారి జీవితంలో ధన సంపద పెరుగుతుంది. అనుకోకుండా ఇంట్లోకి డబ్బు అందుతుంది. వ్యాపారులు ఇదివరకు పెట్టిన పెట్టుబడులపై లాభాలు గణణీయంగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. అధికా ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2024 / 08:36 AM IST

    Zodiac signs

    Follow us on

    Zodiac signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రహాల కలయిక ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలు ఉండనున్నాయి. ఆగస్టు 16 నుంచి బుధ, గురు, శుక్ర గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. అప్పటి నుంచి ఏడాది పూర్తయ్యే వరకు మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ రాశుల వారి జీవితాలు వారు ఊహించని విధంగా ఉంటాయి. వాటి వివరాల్లోకి వెళితే..

    మూడు గ్రహాల కలయిక వల్ల మేషరాశి వారి జీవితంలో ధన సంపద పెరుగుతుంది. అనుకోకుండా ఇంట్లోకి డబ్బు అందుతుంది. వ్యాపారులు ఇదివరకు పెట్టిన పెట్టుబడులపై లాభాలు గణణీయంగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. అధికా ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. విలువైన ఆస్తిని పొందుతారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పాత ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

    బుధ, గురు, శుక్ర గ్రహాలు సమాన స్థితితో ఉండడం వల్ల వృషభ రాశిపై ప్రభావం పడుతుంది. దీంతో ఈ రాశిలో గురువు సంచారం అధికంగా ఉంటుంది. అలాగే శుక్రుడు పంచమ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారు ఊహించని ధనం పొందుతారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇవి లాభిస్తాయి. ఆన్ లైన్ పెట్టుబడులు పెట్టిన వారికి అధికంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. జీతాలు పెరిగే అవకాశం.

    మూడు గ్రహాల కలయిక వల్ల కర్కాటక రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశిలో గురు, శుక్ర గ్రహాలు ధన స్థానంలో ఉంటారు. దీంతో వీరు ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుందది. లాభదాయకమైన ఆఫర్లు వస్తాయి. అనుకోకుండానే ధనం వచ్చి చేరుతుంది. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఏదైనా వివాదం ఉంటే నేటితో సమసిపోతుంది. పొదుపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

    తులా రాశిపై మూడు గ్రహాల ప్రభావం పడుతుంది. ఈ రాశిలో శుక్రుడు, బుధుడితో కలిసి ఎక్కువ రోజులు సంచారం చేసే అవకాశం ఉంది. దీంతో వరు విదేశీ పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆదాయం వృద్ధి చెందుతుంది. బ్యాంకు పెట్టుబుడులపై లాభాలు అధికంగా ఉంటాయి.

    బుధ, గురు, శుక్ర గ్రహాల ప్రభావం వృశ్చిక రాశిపై పడనుంది. దీంతో ఈ రాశి వారిలో కుజుడు ధనస్థానంలో ఉంటారు. ఈ కారణంగా వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వివిధ మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. ఉద్యోగులు చేసే కొత్త ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు పెద్దల సలహా తీసుకోవడం వల్ల లాభిస్తాయి.

    మకర రాశి వారికి గ్రహాల కలయిక వల్ల లాభాలు జరగనున్నాయి. ఈ రాశి వారు దాదాపు ఏడాదంతా లాభాలు పొందుతారు. ఆర్థికంగా ఏ పని చేపట్టినా లాభిస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కొత్త పెట్టుబడుల వల్ల తొందరగా లాభాలు పొందగలుగుతారు.