Homeఆధ్యాత్మికంvaralakshmi pooja : వరలక్ష్మీ పూజ చేస్తున్నారా... ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

varalakshmi pooja : వరలక్ష్మీ పూజ చేస్తున్నారా… ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

varalakshmi pooja : శ్రావణ మాసం రాగానే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ మాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే. అయితే ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అత్యం ప్రధానమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకుంటారు. మహిళలు అత్యంత
భక్తితో లక్ష్మీదేవి అమ్మవారిని నిష్టతో కొలుస్తూ రోజంతా ఉపవాసం ఉంటారు. సాత్విక ఆహారం తీసుకొని అమ్మవారి సేవలో ఉంటారు. నిత్యం అమ్మవారి ప్రవచనాలు చదువుతూ వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇల్లు సంతోషంగా ఉండడానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఇంట్లో ఎలాంటి అలజడులు లేకుండా, సంతోషంగా సాగడానికి అమ్మవారి అనుగ్రహం కోసం మహిళలు ఈరోజు వరలక్ష్మీ వ్రతం చేస్తారని అంటారు. అయితే ఈ వ్రతం కొన్ని నియమాల ప్రకారం నిర్వహిస్తేనే ఫలితం ఉంటుంది. నేటి కాలంలో చాలా మంది వరలక్ష్మీ వ్రతం చేయాలనుకున్నా అవగాహన లేకుండా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఈ పొరపాట్లు చేస్తూ వరలక్ష్మీ వ్రతం చేసినా ఉపయోగం లేదని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఆ తప్పులు ఏంటో తెలుసుకోండి..

వరలక్ష్మీ వ్రతం చేయాలనుకునే మహిళలు ఒకరోజు ముందుగానే పూజ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. ఈ పూజా సామగ్రి ఇతరులు ముట్టకుండా మంచి ప్రదేశంలో ఉంచాలి. వరలక్ష్మీ వ్రతం నిర్వహించే రోజు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత స్నానం చేసిన తరువాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారి పీఠం ఉంచే ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడి ప్రదేశాన్ని శుభ్రపరచాలి. ఆ తరువాత పీటను ఉంచి దానిపై ముగ్గు వేయాలి. ఆ తరువాత కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ పీఠంపై అమ్మవారి ఫొటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. అమ్మవారి రెండు ఏనుగుల విగ్రహాలు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ పూజలు తప్పకుండా రెండు ఏనుగుల విగ్రహాలు ఉండే విధంగా చేయాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. ఇందులో పూజ ముగిశాక ముత్తయిదులకు పసుపు, కుంకుమలను ఇచ్చి పండు, తాంబూలాలతో ఆశీర్వాదం పొందాలి. వీరితో పాటు ఇంట్లో పెద్దలు ఉంటా వారి నుంచి కూడా ఆశీర్వాదం పొందాలి.

వరలక్ష్మీ వ్రతం చేసేవారు కొన్ని పొరపాట్లు అస్సలు చేయొద్దని పండితులు చెబుతున్నారు. అమ్మవారి పూజ మొదలు పెట్టేముందు కచ్చితంగా గణపతి పూజ చేయాలి. గణపతి పూజ చేయకుండా అమ్మవారి పూజ చేస్తే కోపం వస్తుంది. కలశం ఏర్పాటు చేసుకునేటప్పుడు వెండి ప్లేటు లేదా రాగి ప్లేటును ఉపయోగించాలి. గాజు పాత్రను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే వారు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి కోపతాపాలకు పోవద్దు. ఓ వైపు పూజ చేస్తూ మరోవైపు మాట్లాడకూడదు. పూజ పూర్తయిన తరువాత కూడా రోజంతా ఎటువంటి చెడు ఆలోచనలు రానీయకుండా చూడాలి. ఈరోజు ఇంట్లో సాత్విక భోజనం మాత్రమే వండుకోవాలి. ఇంట్లో వాళ్లు కూడా ఎలాంటి మాంసం, మద్యాపానాలు ముట్టకుండా చూడాలి. అలాగే ఈరోజుమొత్తం దైవ చింతనలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version