https://oktelugu.com/

Koduru: పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు.. ఆ విద్యార్థినిని ఏం చేశాడంటే.

తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులది. అందువల్లే ఆచార్యదేవోభవ అనే సూక్తి పుట్టింది. వెనుకటి రోజుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులపై గురుతర బాధ్యతను ప్రదర్శించేవారు. అందువల్లే విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులంటే గౌరవం ఉండేది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 5, 2024 / 03:31 PM IST

    Koduru

    Follow us on

    Koduru: ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు గతంలో మాదిరిగా లేరు. ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చులకనకు గురవుతోంది. ఇటీవల కాలంలో విద్యార్థినుల పై ఉపాధ్యాయులు అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేకుండా ఇలాంటి సంఘటనలు కోకోల్లలుగా జరుగుతున్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వాలు కఠిన వైఖరి అవలంబిస్తున్నప్పటికీ కొంతమంది ఉపాధ్యాయుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇది అంతిమంగా విద్యా వ్యవస్థ పై ప్రభావం చూపిస్తోంది. ఇక ఈ తరహాలోనే ఓ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆ సంఘటన జరిగిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    ఉపాధ్యాయుడు కాదు కామాంధుడు..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోడూరు మండలం నరసింహపురం ఎంపీపీ పాఠశాలలో ఓ విద్యార్థిని మూడవ తరగతి చదువుతోంది. అయితే ఆ విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట తాకుతూ నరకం చూపించాడు. అంతేకాదు ఇదే విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. ఆ విద్యార్థినిని తన వద్దకు పిలిపించుకొని ఈ దారుణానికి పాల్పడుతున్నాడు. ఆ విద్యార్థినిని ఒక్కోసారి వేరే గదిలోకి తీసుకెళ్లి.. చెక్క బేంచి పై కూర్చోపెట్టి.. ఆమె ప్రైవేట్ భాగాలు తాకాడు. ఆమె ఇబ్బంది పెడుతున్నప్పటికీ అతడు తన వైఖరి మానుకోవడం లేదు. ఇక సోమవారం నాడు ఆ విద్యార్థినిని ఎప్పటిలాగానే ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె ప్రవేట్ భాగాలను తాకాడు. అంతటితో ఆగకుండా ఆమె తొడ భాగాన్ని కొరికాడు. ఆ ప్రాంతంలో పంటి గాట్లు పడ్డాయి. ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే ఆ విద్యార్థిని జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులతో చెప్పింది..” పాఠశాలలో ఉపాధ్యాయుడు నాలుగు రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు. తాకరాని చోట తాకుతున్నాడు. తొడ భాగంలో పంటి గాట్లు పడ్డాయని” ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులతో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఎంఈఓ ఫిర్యాదు చేశారు. అయితే అతడు సరిగ్గా పట్టించుకోకపోవడంతో.. పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు.. పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆ ఉపాధ్యాయుడిని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని వైరా మండలంలోనూ ఈ తరహా సంఘటనే చోటుచేసుకుంది. ఆ ఘటనలో ప్రభుత్వం వేగంగా స్పందించింది. వెంటనే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం అతడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.