https://oktelugu.com/

Sonya Hussain : పాకిస్తాన్లో దీపావళి వేడుకలు చేసుకున్న హీరోయిన్.. తర్వాత జరిగింది చూస్తే?

పాకిస్తాన్ కు చెందిన సోన్యా హుస్సేన్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒకరమైన సాహసమే చేసిందనే చెప్పాలి. పాకిస్తాన్ హిందు పండుగలు ఎక్కడా కనిపించవు. కొందరు చేసుకున్నా.. వారిపై కొందరు దాడి చేస్తుంటారు. అలాంటిది ఓ నటి హిందూ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 3:33 pm
    Sonya Hussain

    Sonya Hussain

    Follow us on

    Sonya Hussain : హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. మూడు రోజుల పాటు ఈ వేడుకను నిర్వహించుకుంటారు. అశ్వయిజ మాసంలో అమావాస్య రోజు దీపావళి పండుగను నిర్వహించుకుంటారు. దీపావళి వేడుకలను భారత్ లోనే కాకుండా  బార్డర్ లో ఉన్న సైనికులు కూడా జరుపుకున్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత సైనికుల మధ్య దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. అలాగే విదేశాల్లో ఉన్న హిందువులు కూడా దీపావళి సంబరాల్లో మునిగారు. భారత్ లో ఉన్న అమెరికా రాయబారి ఏకంగా హిందీ పాటకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే. అయితే హిందువుల పండుగలను అందరూ ఆస్వాదిస్తారు. భారత్ లోనూ మిగతా మతాల వారు ఎలాంటి భేదం లేకుండా జరుపుకుంటారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. అక్కడున్న హిందువులు సైతం తమ పండుగలను జరుపుకోలేని స్థితి ఉంది. కానీ ఓ సినీ నటి మాత్రం ఈ ధైర్యం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
    పాకిస్తాన్ కు చెందిన సోన్యా హుస్సేన్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒకరమైన సాహసమే చేసిందనే చెప్పాలి. పాకిస్తాన్ హిందు పండుగలు ఎక్కడా కనిపించవు. కొందరు చేసుకున్నా.. వారిపై కొందరు దాడి చేస్తుంటారు. అలాంటిది ఓ నటి హిందూ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల సినీ నటి సోన్యా హుస్సేన్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంటా దీపాలు పెట్టి సందడి చేశారు.కుటంబ సభ్యులతో కలిసి  నృత్యాలు చేశారు. అలాగే తన ఇంట్లో తయారు చేసుకున్న స్వీట్స్ ను చూపిస్తూ హ్యాపీ దీపావళి అంటూ విషెష్ చెప్పారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉన్న ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో ఉంచారు.  ఈ వీడియో వైరల్ గా మారింది.
    అయితే వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. ఆమె దీపావళి సెలబ్రేషన్ పై కొందరు మద్దతు ఇస్తూ లైక్ లు కొడుతుండగా..మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేస్తే ఆన్ ఫాలో చేస్తామని కామెంట్లు పెడుతున్నారు. అయితే మొత్తంగా సోన్యా హుస్సేన్ వీడియోపై వ్యతిరేకకామెంట్ల కంటే సపోర్టుగా ఉండే మెసేజ్ లే ఎక్కువగా వచ్చాయి. పాకిస్తాన్ లో ఉన్న హిందువుల నేరుగా పండుగలు సెలబ్రేషన్ చేసుకునే అవకాశం లేని సందర్బంగా సినీ నటి ఇలా చేయడంపై కొందరు హిందువులు ఆమెకు సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు.
    అలాగే భారత్ లో ఉన్న కొందరు వివిధ కారణాల వల్ల కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. కనీసం ఇలాంటి పండుగ సందర్భంలో కుటుంబ సభ్యులతో  ఉల్లాసంగా ఉండడం వల్ల బంధాలు బలపడుతాయని అంటున్నారు. విదేశీయుల భారతీయ పండుగలను ఎక్కువగా నిర్వహించుకుంటే.. ఇక్కడి వారిలో కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫెస్టివెల్ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఉండడం వల్ల మనసు ఉల్లాసంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందువల్ల దేశ, విదేశాల్లో ఎక్కడున్నా ఏడాదికి ఒకసారైనా కుటుంబ సభ్యులను కలవడం వల్ల అందరూ సంతోషంగా ఉండగలుగుతారని కొందరు పెద్దలు చెబుతున్నారు.