Tollywood Herione: సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం పాకులాడే భామల పై నిర్మాతలకు ఎప్పుడూ చిన్న చూపు ఉంటుంది. అటు స్టార్ హీరోలు కూడా చిన్నచిన్న రోల్స్ చేసుకునే నటీమణులను అస్సలు పట్టించుకోరు. అయితే.. ఇప్పుడు ఆ చిన్న వాళ్ళ పై ‘గీతా ఆర్ట్స్ 2’, ‘యువీ కనెక్ట్స్’, సిల్లీ మాంక్స్ లాంటి నిర్మాణ సంస్థలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది అమ్మాయిలు నటన పై అడుగులు వేస్తున్నారు.
ఇంకొందరు మరో అడుగు ముందుకేసి.. ఏకంగా సినిమా ఛాన్స్ లు కోసం అఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లోకి వచ్చే తెలుగు అమ్మాయిల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. అందుకే.. కొందరు మేనేజర్లు వారిని మిస్ లీడ్ చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. తెలిసి తెలియక కొందరు వర్ధమాన నటీమణులు మేనేజర్లతో రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నారు.
Also Read: TCA Dhoom Dham: కెనడాలో ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ‘ధూంధాం-2022’
తమకు అవకాశాలు వస్తాయనే ఆశతో వారి చుట్టూ తిరుగుతున్నారు. అందుకే.. ఇలాంటి వారి కోసం ఓ ప్రత్యేక ప్లాట్ ఫామ్ ను క్రియేట్ చేయాలని కొన్ని నిర్మాణ సంస్థలు ప్లాన్ చేశాయి. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను కూడా క్రియేట్ చేయబోతున్నారు. ఈ యాప్ లో కొత్త సినిమాల సంగతులతో పాటు కొత్త వెబ్ సిరీస్ ల అప్ డేట్లు, ఆడిషన్స్ వివరాలు అన్నీ ఉండబోతున్నాయి.
అయితే, ఈ ఆలోచన వెనుక మాజీ హీరోయిన్ ఛార్మి ఉన్నట్లు తెలుస్తోంది. చాలాకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆ అమ్మడు.. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరితో కలిసి సినిమాలను నిర్మిస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఛార్మి.
అయితే, ఆమె సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో క్రేజీ ఆఫర్ల కోసం మేనేజర్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడిందట. అందుకే.. కొత్త హీరోయిన్ల కోసం ఒక మంచి ప్లాట్ ఫామ్ ను క్రియేట్ చేయబోతుంది. పలు నిర్మాణ సంస్థల సహకారంతో ఛార్మి ఈ ప్లాట్ ఫామ్ ను ముందుకు తీసుకుపోతుందట. ఈ క్రమంలో నటీమణుల నుంచి ఛార్జ్ లు కూడా వసూళ్లు చేస్తోందట. మరి ఛార్మి హీరోయిన్ల వ్యాపారం రాణించాలని కోరుకుందాం.