https://oktelugu.com/

TCA Dhoom Dham: కెనడాలో ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ ఆధ్వ‌ర్యంలో ఘనంగా ‘ధూంధాం-2022’

TCA Dhoom Dham: కెనడా లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ధూంధాం 2022 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో శనివారం గ్రేటర్ టోరంటో నగరంలో వీటిని నిర్వహించారు. కెనడా తెలంగాణ వాసులు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ధూంధాం- 2022 ఉత్సవాలు హోలీ ట్రినిటీ సెకండరీ, ఓక్ విల్లేలో ఘనంగా జరుపుకున్నారు. సంబరాలను కార్యదర్శి దామోదర్ రెడ్డి మాది ప్రారంభించగా, విష్ణుప్రియ ఈద, కవిత తిరుమలాపురం, దీప గజవాడ, […]

Written By:
  • NARESH
  • , Updated On : July 13, 2022 / 11:42 AM IST
    Follow us on

    TCA Dhoom Dham: కెనడా లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ధూంధాం 2022 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో శనివారం గ్రేటర్ టోరంటో నగరంలో వీటిని నిర్వహించారు. కెనడా తెలంగాణ వాసులు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ధూంధాం- 2022 ఉత్సవాలు హోలీ ట్రినిటీ సెకండరీ, ఓక్ విల్లేలో ఘనంగా జరుపుకున్నారు. సంబరాలను కార్యదర్శి దామోదర్ రెడ్డి మాది ప్రారంభించగా, విష్ణుప్రియ ఈద, కవిత తిరుమలాపురం, దీప గజవాడ, రజని మాది మరియు వసంత రుద్రోజి దీప ప్రజ్వలన చేసి కొనసాగించారు.

    అనంతరం తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు ఈద రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడంలో భాగంగా టొరంటో నగరంలో టీసీఏ ఆధ్వర్యంలో చేసిన కృషి ని కొనియాడారు. ఫౌండేషన్ కమిటీ చైర్ వేణు రోకండ్ల, ట్రస్టీ చైర్ సంతోష్ గజవాడ, వైస్ ప్రెసిడెంట్ మన్నెం శ్రీనివాస్ కల్చరల్ సెక్రటరీ కవిత తిరుమలాపురం, ఆరంభ ప్రసంగంలో తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వర్చ్యువల్ గా పాల్గొన్నారు. టీసీఏ కార్య వర్గ సభ్యులకు, కెనడా తెలంగాణ, తెలుగు వాసులకు ధూమ్ ధామ్ -2022 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

    తెలంగాణ యాసను సినిమా ప్రపంచానికి వాడకంలో తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు గౌరవ అతిథి తనికెళ్ళ భరణి వర్చ్యువల్ గా పాల్గొని ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి శివుడి మీద పుస్తకాలని పంపిణి చేసారు. ముఖ్య అతిథి ధీరజ్ పరీఖ్ కాన్సుల్ జనరల్- వెల్ఫేర్, గెస్ట్ స్పీకర్ ఒంటారియో రాష్త్ర ఎంపీపీ దీపక్ ఆనంద్ విచ్చేసి టీసీఏ వారు తెలంగాణ సంస్కృతినీ భావి తరాలకు చేర్చే విధానాన్ని అభినందిస్తూ గవర్నమెంట్ అప్ప్రీసియేషన్స్ సర్టిఫికెట్ టీసీఏ ప్రెసిడెంట్ కు అందచేసారు.

    -ఆకట్టుకున్న బోనాలు, మహాజాతర సమ్మక్క–సారలమ్మ
    ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బోనాల ఊరేగింపుతోపాటు మేడారం తెలంగాణ మహా జాతర సమ్మక్క – సారలమ్మ ను చిలకల గుట్ట ద్వారా తీసుకు వచ్చే విధానం నిర్వహించారు. విజయకుమార్ తిరుమలాపురం మరియు మూర్తి కలగోని డప్పు వాయిద్యాలతో ఘనంగా చిన్నారుల జాతర ప్రదర్శించిన తీరు సభికులను ఎంతగానో ఆకట్టుకుంది.

    ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘ఎత్తరాజెండా’ సినిమాలోని పాటను 15 మంది చిన్నారులతో ప్రదర్శించారు. ధీరజ్ బర్ల, లక్ష్మి సంధ్యలు ధూమ్ ధామ్ గా డ్యాన్స్ చేసి సభికులను ఉర్రూతలూ ఊగించారు. TCA వారు ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ వారితో కలర్ ఫుల్ గా ఏర్పాటుచేయడంపై పలువురు ప్రశంసించారు.

    ఈ సంబరాల్లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, నవీన్ ఆకుల, ఉదయ్ భాస్కర్ గుగ్గిళ్ల. బోర్డు అఫ్ ట్రస్టీ, శ్రీనివాస్ రెడ్డి దేపా, రాజేష్ అర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి. ఫౌండేషన్ కమిటీ సభ్యులు విజయ్ కుమార్ తిరుమలాపురం, కోటేశ్వర్ రావు చిత్తలూరి, శ్రీనివాస్ తిరునగరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ బాలినేని, కుమారి ధాత్రి అంబటి వేడుకల మాస్టర్స్ గా వ్యవహరించారు.

    టీసీఏ వారు తెలంగాణ ప్రామాణికమైన బిర్యానీ, రుచికరమైన భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమం స్థానిక తెలుగు వారితో సుమారు 4 గంటల పాటు ప్రదర్శించబడింది. ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞత వందన సమర్పణతో విజయవంతంగా ఇది ముగిసింది.