Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె గురించి తెలియని వారుండరు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించినా కూడా తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడంటే ఇష్టమే.. టాలీవుడ్ లో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ప్రతిభ, అందంతో ఆకట్టుకున్న దీపికా రీణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. కానీ వీరి పెళ్లికంటే ముందే ఆమెకు చాలా మంది తో ఎఫైర్లు ఉన్నాయనే టాక్ ఉంది. మరి ఆ లిస్ట్ ఓ సారి చూసేయండి..
1..ఎమ్.ఎస్ ధోని.. ఓ క్రికెటర్ తో దీపికా డేటింగ్ చేస్తుందని గతంలో చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరో కాదు ధోనీ అని తర్వాత క్లారిటీ వచ్చింది. ధోనీ గురించి చాలా సార్లు తనకున్న ఇష్టం, అభిమానాన్ని బయటపెట్టేది. కానీ రిలేషన్ విషయంలో చాలా గోప్యంగా ఉంచేది దీపికా. అంతేకాదు యువరాజ్ సింగ్, ధోనీలతో ట్రయాంగిల్ లవ్ నడిపిందనే టాక్ కూడా వచ్చింది.
2.. నిహార్ పాండ్యా.. ముంబై వ్యాపార వేత్త నిహార్ పాండ్యాతో కూడా ఈ బాలీవుడ్ బ్యూటీ అఫైర్ పెట్టుకుందట. మూడు సంవత్సరాలుగా కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత విడిపోయారట. ఈయన దీపికాతో రిలేషన్ తర్వాత సింగర్ నీతి మోహన్ ను పెళ్లి చేసుకున్నారు.
3..ఉపేన్ పటేల్.. వీరిద్దరి ఫోటో షోట్ వల్ల వీరి మధ్య ఏదో సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందనే టాక్ వచ్చింది. ఇందులో కపుల్స్ లాగా ఫోటోలకు ఫోజులిస్తూ.. చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోల వల్ల వీరి రిలేషన్ గురించిన పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.
4.. యువరాజ్ సింగ్.. ఇక ధోని గురించిన రిలేషన్ వార్తలు రాలేదు కానీ.. యువరాజ్ సింగ్ తో రిలేషన్ లో ఉందనే వార్తలు మరింత ఎక్కువయ్యాయి. అయితే వీరి బిజీ షెడ్యూల్ వల్లనే బ్రేకప్ అయిందనే టాక్ కూడా ఉంది. ఓ సారి యువరాజ్ సింగ్ కూడా ఇంటర్య్వూలో వీరి బ్రేకప్ గురించి మాట్లాడారు.
5.. రణబీర్ కపూర్: రణబీర్ కపూర్, దీపికా డీప్ లవ్ లో ఉన్నారనే విషయం తెలిసిందే. దీనికి చిహ్నంగా రణబీర్ మీద ఉన్న ప్రేమతో దీపికా ఏకంగా తన మెడ మీద పచ్చబొట్టునే వేయించుకుంది. కానీ వీరు కూడా రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత 2009లో విడిపోయారు.
6.. సిద్ధార్థ్ మాల్యా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా కుమారుడు సిద్దార్థ్ మాల్యా తో డేటింగ్ చేసింది. వీరి మధ్య జరిగిన ముద్దు సన్నివేశం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు వీరి ముద్దు సన్నివేశం వైరల్ గా మారి వీరి ప్రేమను అందరికి తెలిసేలా చేసింది.