https://oktelugu.com/

5 Top Performers in Pushpa 2: పుష్ప2లో దిమ్మదిరిగేలా నటించి ఓ రేంజ్ సెట్ చేసిన ఆ ఐదుగురు టాప్ పర్ఫామెన్స్ ఎవరో తెలుసా..?

పుష్ప భార్యగా నటించిన రష్మిక మందాన కూడా తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించింది. ఇక ముఖ్యంగా పుష్ప రాజు క్యారెక్టర్ కి సపోర్ట్ చేస్తూ తనదైన రీతిలో నటిస్తూ తనను నమ్మే ఒక వైఫ్ క్యారెక్టర్ లో నటించి పుష్ప క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో చాలావరకు హెల్ప్ అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : December 7, 2024 / 10:48 AM IST

    5 Top Performers in Pushpa 2

    Follow us on

    5 Top Performers in Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తాను చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియాలో భారీ మార్కెట్ మీద కన్నేసిన ఆయన ఇప్పటికే పుష్ప సినిమాతో సంచలనాలను సృష్టించాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా ఆయనకంటూ స్పెషలైజేషన్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పుష్ప 2 సినిమాకి బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూడడానికి ఉర్రుతలుగుతున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమాని ఒకటికి రెండుసార్లు చూస్తూ భారీ కలెక్షన్లను సంపాదించి పెట్టడంలో కీలకపాత్ర వహిస్తున్నారు. ఇక ఏది ఏమైనా ‘పుష్ప 2’ మాస్ జాతర చూడాలి అంటే థియేటర్ కి వెళ్ళాల్సిందే… నిజానికి పుష్ప 2 సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఈ సినిమాలో నటించిన టాప్ 5 క్యారెక్టర్స్ కారణం అనే చెప్పాలి… ఇంతకీ ఆ ఐదు క్యారెక్టర్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    అల్లు అర్జున్

    ముందుగా ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు భుజాల మీద మోసుకెళ్లిన అల్లు అర్జున్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించాడు. ముఖ్యంగా పుష్ప 2 పాత్రను ఓన్ చేసుకొని పర్ఫార్మ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆ క్యారెక్టర్ ను ఎవరు చేయలేరు అనేంతలా మెప్పించిన అల్లు అర్జున్ ఈ సినిమా సక్సెస్ లో 90% బాధ్యతను తనే తీసుకున్నాడనే చెప్పాలి…

    రష్మిక మందాన

    ఇక ఇందులో పుష్ప భార్యగా నటించిన రష్మిక మందాన కూడా తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించింది. ఇక ముఖ్యంగా పుష్ప రాజు క్యారెక్టర్ కి సపోర్ట్ చేస్తూ తనదైన రీతిలో నటిస్తూ తనను నమ్మే ఒక వైఫ్ క్యారెక్టర్ లో నటించి పుష్ప క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో చాలావరకు హెల్ప్ అయింది. అలాగే పుష్ప రాజు వాళ్ళ అన్నయ్య అయిన అజయ్ తో గంగాలమ్మ జాతర సమయంలో పుష్ప అంటే బ్రాండ్ అంటూ ఆమె చెప్పిన డైలాగులు థియేటర్లో చూస్తున్న వాళ్లకి గూస్ బంప్స్ తెప్పించడమే కాకుండా సినిమా మొత్తానికి ఈ సీన్ అనేది చాలా హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి…

    ఫాహాద్ ఫజిల్

    విలక్షణ నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న ఫాహద్ ఫజిల్ నటించిన బన్వర్ సింగ్ షేకావత్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది. పుష్ప రాజ్ ను ఢీకొట్టే పాత్రలో అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా ఫాహాద్ ఫజిల్ పాత్ర ఈ సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక తను విలనిజాన్ని పండిస్తూనే అక్కడక్కడ కామెడీ కూడా చేయడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది…

    రావు రమేష్

    పుష్ప మొదటి పార్ట్ క్లైమాక్స్ లో రావు రమేష్ పుష్ప ని సిండికేట్ లీడర్ గా చేయడం వల్ల సెకండ్ పార్ట్ లో కూడా రావు రమేష్ కి పుష్పకి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంటుంది. ఇక దానివల్లే రావు రమేష్ ను సీఎంగా చేయాలనుకొని ఆయన కోసమే ఈ సినిమా మొత్తాన్ని నడిపించడం అనేది ఆయన క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని కూడా తెలియజేస్తుంది… ఇక ఈ సినిమా ముందుకు నడవడంలో రావు రమేష్ కూడా కీలకపాత్ర వహించాడనే చెప్పాలి…

    అజయ్

    ఇక ఈ సినిమాలో పుష్ప అన్నగా నటించిన అజయ్ కూడా కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. తన ఫ్యామిలీతో కలవాలనుకుంటున్న పుష్ప ఫ్యామిలీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ వస్తూ చివర్లో తన కూతురిని సేవ్ చేయడంతో అజయ్ పుష్ప ను తన తమ్ముడిగా స్వీకరిస్తాడు. ఇక వీళ్ళ బంధాన్ని కూడా చివర్లో చాలా ఎమోషనల్ గా మలిచారు…

    ఇక మొత్తానికైతే ఈ సినిమా మొత్తం లో ఈ ఐదు పాత్రలే సినిమాని ముందుకు నడిపించాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దీనివల్లే సినిమా టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది…