5 Top Iconic Seans in Puspa 2 :: అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది. మరి సుకుమార్ ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేశాడు. ఎందువల్ల ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. అసలు ఈ సినిమాలో ఏ సీన్లు హైలైట్ అయ్యాయనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం…
పుష్ప అంటేనే ఒక బ్రాండ్ అనేది మనకు పుష్ప మొదటి పార్ట్ లోనే దర్శకుడు సుకుమార్ చాలా స్టైలిష్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. ముఖ్యంగా మాస్ ఓరియెంటెడ్ సీన్లకు థియేటర్లో పూనకాలు వస్తున్నాయి. నిజానికి పుష్ప అనేది యూనివర్సల్ బ్రాండ్ గా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు సైతం పుష్ప సినిమాకి ఎవ్వరు ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప ఒక బ్రాండ్ గా మారిపోయింది. దానికి అదే ప్రమోషన్స్ చేసుకుంటుంది అంటూ ఒక సంచలన విషయాన్ని చెప్పడం ఈ సినిమా మీద ఉన్న హైప్ ని చెప్పకనే చెబుతుంది…
ఇక ఇదిలా ఉంటే సుకుమార్ రాసుకున్న ఒక ఐదు సీన్లు ప్రేక్షకులను థియేటర్ కి రిపీటెడ్ గా రప్పిస్తున్నాయి. ఆ సీన్లు ఏంటంటే
పుష్ప బన్వర్ సింగ్ షేకవత్ కి సారీ చెప్పి మళ్ళీ తన ఇగో హర్ట్ అయిందని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి దాంట్లో పడిపోయిన ఫాహాద్ ఫజిల్ జు చూస్తూ అక్కడే మూత్రం పోయడం అనేది పుష్ప ఈగో సాటిస్ఫై అయింది అనేది మనకు చాలా క్లియర్ కట్ గా చూపించారు…ఇక ఈ సీన్ థియేటర్ లో చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకోవడంతో పాటు పుష్ప అంటే ఎలా ఉంటుందో మరొకసారి చూపించాడు అంటూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇక దీంతో పాటుగా పుష్ప 2000 టన్నుల ఎర్రచందనం సరుకును బార్డర్ దాటిస్తానని చెప్పి మరి బన్వర్ సింగ్ షేకావత్ కి దొరక్కుండా దానిని బార్డర్ దాటించే సీను అయితే థియేటర్ లో చూసిన ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ తెప్పిస్తుందనే చెప్పాలి…
ఇక గంగాలమ్మ జాతరలో అల్లు అర్జున్ అమ్మవారు పూనితే ఎలా డాన్స్ చేస్తారో అలాంటి ఒక డాన్స్ ని చేసి ప్రేక్షకులందరిలో పూనకాలైతే తెప్పించాడు. ఇక నిజానికి ఫైట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక దాంతోపాటుగా అదే సీన్లో అజయ్ తో రష్మిక మందాన పుష్ప అంటే బ్రాండ్ అంటూ చెప్పే డైలాగులు కూడా సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇస్తు పుష్ప క్యారెక్టర్ మీద ఇంకా డెప్త్ అయితే పెరుగదానికి ఉపయోగపడుతుంది…
ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే సూపర్ అనే చెప్పాలి. అజయ్ వాళ్ల కూతురి కోసం ఒక్కడే ఒంటరిగా వెళ్లిన పుష్ప చేతులు కాళ్లు కట్టేసి కొడుతుంటే చేతులు కాళ్లు కట్టేసి ఉన్నప్పటికీ ఒక్కొక్కరి పీకలు కొరుకుతూ చేసిన ఫైట్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో రాలేదని చెప్పాలి. నిజంగా అల్లు అర్జున్ ఆ ఫైట్ సీక్వెన్స్ లో అయితే చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడనే చెప్పాలి…
ఇక క్లైమాక్స్ లో అజయ్ తను చేసిన తప్పును తెలుసుకొని పుష్పను తన తమ్ముడిగా స్వీకరించడానికి వచ్చినప్పుడు తను ఎలా రియాలైజ్ అయ్యాడనే పాయింట్ ను కూడా చాలా ఎమోషనల్ గా టచ్ చేసి చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవల్లో ఉంది…
ఈ ఐదు సీన్లు థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీటివల్లే చాలామంది అభిమానులు థియేటర్ కి రిపీటెడ్ గా వస్తూ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంలో భాగమవుతున్నారు…