Junior NTR : సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ఠీవీ. ఆయన నడిచి వస్తుంటే భూలోకమే నడిచి వస్తున్నట్టు ఉంటుంది. ఇక అదే అందాన్ని, ఠీవీని వారసత్వంగా తెచ్చుకున్నాడు జూ. ఎన్టీఆర్. ఆయన ఫిట్నెస్, బాడీ, ఎయిర్, బియర్డ్ తో సహా అందంగా కనిపిస్తుంటాడు ఇప్పటి ఈ స్టార్ హీరో. అయితే సడెన్ గా ఎన్టీఆర్ లుక్ మారిపోయింది. అందుకే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ఏమైంది? అంటూ సోషల్ మీడియా మొత్తం తెగ వెతికేస్తున్నారు ఆయన అభిమానులు. ఎన్టీఆర్ కు ఏమవ్వడం ఏంటి.. ? ఆయన బాగానే ఉన్నాడుగా అని మీరు అనుకుంటే కూడా తప్పే. నిజంగానే ఎన్టీఆర్ చాలా మారిపోయారు.
కొన్నిరోజులుగా ఎన్టీఆర్ ముఖంలో మార్పులు వచ్చాయి అనేది వాస్తవం. బాగా బక్కచిక్కి, ముఖంలో కళ తగ్గింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పేషేంట్ లా కనిపిస్తున్నాడు ఈ స్టార్ హీరో. అందుకే అభిమానులను చాలా ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ నటుడు కోట శ్రీనివాసరావు మరణించడంతో సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. అయితే ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి రాలేకపోయారు ఎన్టీఆర్. అంత్యక్రియలు అయిన తర్వాత ఎన్టీఆర్.. కోట కుటుంబాన్ని కలిసి పరామర్శించాడు.
Also Read: రిస్కీ స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన స్టంట్ మాస్టర్..వణుకుపుట్టిస్తున్న వీడియో!
కోట ఆయనకు ఎంత ఆప్తుడో.. ఆయన లేని లోటు పరిశ్రమకు ఎంత ఉందో తెలిపారు. ఇదంతా ఒకే కానీ.. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్ ను చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా ఎన్టీఆర్ ముఖం చేంజ్ అయింది. అసలు ఒక పేషెంట్ లా కనిపించడంతో తారక్ కు ఏమైందంటూ ఆరాలు తీస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ ను మెయింటెన్ చేస్తుంటాడు తారక్. బరువు పెరిగి కనిపిస్తారు. ఆ తర్వాత పాత్రను బట్టి బరువు తగ్గుతారు. అంటే ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ లో మెరుస్తుంటాడు అన్నమాట. ఆర్ఆర్ఆర్, దేవర సినిమా కోసం బరువు పెరిగాడు. తర్వాత వార్ 2 కోసం బరువు తగ్గాడు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడు తారక్.. అయితే ఇప్పుడు ఈ మారిన లుక్ ఆ సినిమా కోసమనే టాక్. కానీ ఈ లుక్ అస్సలు బాలేదు. ప్రశాంత్ నీల్ హీరో అంటే కచ్చితంగా బరువు ఉండాలి. అందుకు తగ్గట్టే ఎలివేషన్స్ కూడా ఉండాల్సిందే. అంతే విధంగా ఫిట్ నెస్ తో కనిపించాలి. అని మీరు అనుకుంటారు కూడా. దీనికి సూట్ అయ్యేలా తారక్ బాడీ అసలు ఫిట్ గా కూడా లేదు కదా. నిద్రలేకుండా ఉన్నవారి ముఖంలా కనిపిస్తుంది. సో ఇది ప్రశాంత్ నీల్ సినిమా కోసం కాదు అనుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమాలో రెండు పాత్రలు ఉంటాయట. ఒక పాత్రలో బలవంతుడిలా మరో పాత్రలో బలహీనుడిలా కనిపించాలట. అందుకే ఇప్పుడు ఇలా మారిపోయాడు అని సమాచారం. బక్కగా కనిపించే క్యారెక్టర్ కోసం మాత్రమే ఇలా మారాడు అని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి పూర్తి సమాచారం రావాలంటే ఎన్టీఆర్ స్పందించాల్సిందే.
Also Read: బాలయ్య చేయాల్సిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
మొత్తం మీద ఒకప్పుడు బూరె బుగ్గలతో.. కళకళలాడే ఎన్టీఆర్.. ఇప్పుడిలా ఎండిపోయిన ముఖంతో కనిపంచడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. సినిమా కోసం అయినా సరే నచ్చడం లేదంటున్నారు. నిజంగా ఈ లుక్ పాత్ర కోసమా? అనారోగ్యంతో బాధపడుతున్నాడా అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటన రావాలి. చూద్దాం.