Homeఎంటర్టైన్మెంట్Hey Balwanth Movie Twitter Review: 'హే బలవంత్' ట్విట్టర్ టాక్ వచ్చేసింది..సుహాస్ నుండి ఇలాంటి...

Hey Balwanth Movie Twitter Review: ‘హే బలవంత్’ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..సుహాస్ నుండి ఇలాంటి మూవీ ఊహించలేదు!

Hey Balwanth Movie Twitter Review: వరుస విజయాలతో తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకున్న సుహాస్(Actor Suhas), లేటెస్ట్ గా ‘హే బలవంత్'(Hey Balwanth) చిత్రంతో మన ముందుకొచ్చాడు. నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో ఈ సినిమా మొదలైంది. ముందుగా ఈ చిత్రానికి ‘హే భగవాన్’ అనే టైటిల్ పెట్టారు. కానీ సెన్సార్ పూర్తి అయ్యాక, సెన్సార్ సభ్యులు ఆ టైటిల్ ని నిరాకరించడంతో ‘హే బలవంత్’ గా మార్చారు. […]

Hey Balwanth Movie Twitter Review: వరుస విజయాలతో తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకున్న సుహాస్(Actor Suhas), లేటెస్ట్ గా ‘హే బలవంత్'(Hey Balwanth) చిత్రంతో మన ముందుకొచ్చాడు. నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో ఈ సినిమా మొదలైంది. ముందుగా ఈ చిత్రానికి ‘హే భగవాన్’ అనే టైటిల్ పెట్టారు. కానీ సెన్సార్ పూర్తి అయ్యాక, సెన్సార్ సభ్యులు ఆ టైటిల్ ని నిరాకరించడంతో ‘హే బలవంత్’ గా మార్చారు. విడుదలకు ముందు ఈ సినిమా ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఫన్నీ ఎలిమెంట్స్ తో పాటు, కొత్త రకం కాన్సెప్ట్ కూడా ఉన్నట్లుంది, కచ్చితంగా ఇది యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనుకున్నారు. అలా మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?, ముఖ్యంగా ట్విట్టర్ జనాలు ఏమని అంటున్నారు అనేది వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం.

‘హే బలవంత్’ చిత్రంలో కామెడీ కొన్ని హిట్ల చాలా బాగా వర్కౌట్ అయ్యిందని, కానీ ఓవరాల్ సినిమాని మొత్తం ఎంగేజింగ్ గా నడపడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందని, అనేక చోట్ల కామెడీ హిలేరియస్ గా అనిపించిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా రివర్స్ లో ఉందని అంటున్నారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదట. చాలా క్రింజ్ గా అనిపించాయట. అంతే కాకుండా ఈ కాన్సెప్ట్ లో ఎమోషన్ ని పెట్టాలనుకోవడం పెద్ద రిస్క్, డైరెక్టర్ ఆ రిస్క్ చేసి దారుణంగా ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. ఎమోషన్ అసలు వర్క్ అవ్వలేదట. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ ఏదైనా ఉందా అంటే అది కమెడియన్ సుదర్శన్ కామెడీ నే. ఆయన నోటి నుండి వచ్చిన వన్ లైన్ డైలాగ్స్ బాగా పేలాయి.

ట్రైలర్ లో నరేష్ పాత్రని చూసి ఈ సినిమాకు హైలైట్ అవుతుందని అనుకున్నాము కానీ, ఆ రేంజ్ లో మాత్రం లేదనే చెప్పాలి. సినిమాలో కామెడీ ట్రాక్ మొత్తం నరేష్ చేసే వ్యాపారం చుట్టూనే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఆ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం రిపీట్ అనిపించింది. న్యారేషన్ లో కంటెంట్ బలంగా లేకపోతే ఇలాంటి ఔట్పుట్ లే వస్తాయని, ఓవరాల్ గా ఈ చిత్రం బిలో యావరేజ్ రేంజ్ లో ఉంటుందని, కానీ ఒకసారి టైం పాస్ కోసం చూద్దాం అని అనుకునేవాళ్లకు ఈ సినిమా నచ్చుతుందని అంటున్నారు. ఇంకా ట్విట్టర్ నుండి ఈ చిత్రానికి నెటిజెన్స్ నుండి ఎలాంటి రివ్యూస్ వచ్చాయో మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper