Prabhas Music Director: సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు విశేషమైన ఆదరణ లభిస్తుంది. కాబట్టి వాళ్లతో సినిమాలను చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం…ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా గొప్ప గుర్తింపైతే రాలేదు. ఇకానీ మన హీరోలు ఈ మధ్యకాలంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమాలతో భారీ క్రేజీనైతే దక్కించుకుంటున్నారు… ఇక ప్రతి ఒక్క హీరోకి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అద్భుతమైన మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇతరుల సినిమాలకు మ్యూజిక్ ఇచ్చినప్పుడు అంత రేంజ్ లో ఎఫెర్ట్స్ అయితే పెట్టడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఒక్కో హీరోకి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఉన్నాడు. బాలయ్య బాబుకి తమన్ అద్భుతమైన మ్యూజిక్ ను అందిస్తున్నాడు. బాలయ్య సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంలో తమన్ కీలకపాత్ర వహిస్తున్నాడనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే నందమూరి తమన్ గా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అత్యద్భుతమనే చెప్పాలి. ఆర్య నుంచి మొదలైన వీళ్ళ ప్రస్థానం ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.
మొదటి నుంచి కూడా దేవి చాలా మంచి మ్యూజిక్ అయితే ఇస్తున్నాడు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆల్బమ్స్ మాత్రం మాత్రం సూపర్ సక్సెస్ ని సాధిస్తూనే వస్తున్నాయి. ఇక ‘పుష్ప 2’ సినిమా వరకు వీళ్ళ ప్రస్థానం సక్సెస్ ఫుల్ గా కొనసాగిందనే చెప్పాలి…
ఇక బాలయ్య కి తమన్, అల్లు అర్జున్ కి దేవి శ్రీ ప్రసాద్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్లు గా ఉన్నారు. మరి ప్రభాస్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రభాస్ కి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరు ఆయన మణిశర్మ, కీరవాణి, దేవి శ్రీ ప్రసాద్ లతో ఎక్కువగా సినిమాలు చేశాడు.
అందరు తనకు బెస్ట్ అవుట్ ఫుట్ ని ఇచ్చారు. కాబట్టి స్వతహాగా తనకంటూ మ్యూజిక్ ని బాగా ఇచ్చిన సంగీత దర్శకులు ఎవరూ లేరు… ఫ్యూచర్ లో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా వస్తారా ప్రభాస్ ని ఎలివేట్ చేసే విధంగా మ్యూజిక్ ని అందించి తన ఆస్థానం సంగీత దర్శకుడిగా మారిపోతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…