https://oktelugu.com/

US Elections: అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఆధిక్యం.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే?

అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ ఎవరో తెలేందుకు ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం రిపబ్లిక్పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం

Written By:
  • Srinivas
  • , Updated On : November 6, 2024 / 11:14 AM IST

    Trump

    Follow us on

    US Elections: అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ ఎవరో తెలేందుకు ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం రిపబ్లిక్పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్ 230 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. యూనైటెడ్ స్టేట్స్ లో అతిపెద్ద రాష్ట్రం అయిన ఫ్లోరిడా ట్రంప్ ఖాతాలోనే పడింది. అలాగే ఇండియానా, నెబ్రాస్కా, ఓక్ల హోమా, టెక్సాస్, అర్కాన్సాస్, లూసియానా, మిస్సోరి, ఓమామో, వెస్ట్ వర్జినియో వంటి రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలోనే పడడంతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ఇక డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ సైతం ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తుంది. అయితే ట్రంప్ కంటే వెనుకంజలోనే ఉన్నారు. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం కమలా హారీస్ 205 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు.

    అమెరికాలో ప్రతీ నాలుగేళ్లకోసారి సమయం ప్రకారం ఎన్నికలు జరగుతూ ఉంటాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడు కావడమంటే దాదాపు ప్రపంచంలోని కొన్ని దేశాలపై ఆధిపత్యాన్ని సాధించడమే. అమెరికా అధ్యక్షుడు తీసుకునే కొన్ని నిర్ణయాలు మిగతా దేశాల్లో ప్రభావం ఉంటుంది. అందువల్ల అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచ దేశాలకు ఆసక్తి ఉంటుంది. అయితే తాజాగా జరుగుతున్న పోలింగ్ ప్రకారం ఎక్కువగా ట్రంప్ కే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్వింగ్ రాష్ట్రాల్లోని కొన్ని ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలో ఉన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

    అమెరికాలో బ్యాలెట్ పద్దతి ప్రకారమే పోలింగ్ జరుగుతూ ఉంది హ్యాండ్ మార్క్ డ్ బ్యలెట్ పేపర్ ద్వారా కొందరు, పేపర్ బ్యాలెట్ ద్వారా మరికొందరు ఓటు వేస్తున్నారు. అయితే ఓటేసిన తరువాత తమ ఓటుకు సంబంధించిన ప్రింట్ ను అప్పటికప్పుడే ప్రింట్ తీసుకుంటున్నారు. అయితే ఈవీఎంల ద్వారా కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇది కేవలం 5 శాతం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈవీఎంల హ్యాకింగ్, ట్యాంపరింగ్ కారణంగా చాలా మంది అమెరికా ఓటర్లు డీఆర్ఈలకు దూరంగా ఉండి బ్యాలెట్ ద్వారానే ఓటు వేస్తున్నారు.

    గత ఎన్నికల్లో 66 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు కొన్ని లెక్కలు తెలుస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో మొత్తం 6గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ ప్రధానంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ హామీలు ఇచ్చారు. అయితే కమలా హారీస్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యూదుల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది.వీరు తమ ఓటు ట్రంప్ కే వేస్తామంటూ బహిరంగంగా ప్రకటించారు.

    ఇదిలా ఉండగా పోలింగ్ పూర్తయిన తరువాత వెంటనే కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అయితే 48 గంటల్లోనే ఫలితాలు వెలవడాలి. కానీ ఈసారి నవంబర్ 11న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. కానీ ఈ లోపు పలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడిగా ఎవరైతే ఎన్నుకోబడుతారో.. వారు నాలుగేళ్లు మాత్రమేపదవిలో ఉంటారు. అభ్యర్థులు రెండు సార్లు మాత్రమే పోటీ చేయడానికి అరర్హులు. తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.