Maharashtra Elections: ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఆదిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అజిత్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన అభ్యర్థి పహాద్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. ఈయన ప్రముఖ సింగర్, నటి స్వర భాస్కర్ భర్త కావడం విశేషం. మహారాష్ట్రలోని అను శక్తి నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పహాద్ అహ్మద్ గతంలో సమాజ్ వాది పార్టీలో ఉండేవారు. గత అక్టోబర్లో ఆయన అజిత్ పవర్ కు చెందిన ఎన్సిపీలో చేరారు.
మహారాష్ట్రలోని అనుశక్తి నగర్ నియోజకవర్గం నేషనల్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన కురవృద్ధుడు నవాబ్ మాలిక్ కు కంచుకోటగా ఉంది.2009, 2014, 2019 దఫాలో ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. అయితే ఈసారి నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ బరిలో ఉన్నారు. ఆయనపై అజిత్ పవర్ ఎన్సిపి కి చెందిన పహాద్ అహ్మద్ పోటీ చేశారు. మహా వికాస్ అకాఢ కూటమిలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ నుంచి ఈయన టికెట్ తెచ్చుకున్నారు.
పహాద్ అహ్మద్ ఉత్తర ప్రదేశ్ ఆలీగర్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై, నుంచి ఎంపీల్ పూర్తి చేశాడు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే గత అక్టోబర్లో అజిత్ పవర్ ఎన్సీపీ పార్టీలో చేరారు.
పద్మ ప్రముఖ బాలీవుడ్ నటి సింగర్ నటి, స్వరభాస్కర్ ను 2023 ఫిబ్రవరి 16న పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా భర్తకు తోడుగా స్వర భాస్కర్ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా తన భర్త కు మద్దతుగా ప్రజల నుంచి విరాళాలను కోరుతూ ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా మాట్లాడుతూ నా భర్త పహాడ్ అహ్మద్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆశక్తి నగర్ నుంచి పోటీ చేస్తున్నారు.. ఇది అతని క్రౌడ్ ఫండింగ్ ప్రచారం రాజకీయాల్లో నిబద్ధత ప్రగతిశీల విద్యావంతులైన యువకుడికి మద్దతు ఇవ్వడానికి దయచేసి విరాళాలు ఇవ్వండి.. అంటూ కోరారు. స్వర భాస్కర్ పహాద్ అహ్మద్ ను మతాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె భారీ ప్రోలాప్స్ ను ఎదుర్కొంది.
అయితే సమాజ్వాది పార్టీలో కీలకంగా ఉన్న ఆయన ఎన్సీపీలో చేరడంపై ఎన్నికల సమయంలో కొందరు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్సిపి, సమాజ్వాది పార్టీలు కుటుంబాల లాంటివి. ఇప్పుడు ఇద్దరూ చాలా బలమైన బంధాన్ని కలిగి ఉన్నారు. అని చెప్పారు