Wayanad: కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వయనాడ్ నియోజకవర్గ ఫలితాల్లో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు లక్షకుపైగా మెజార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని వయనాడు లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఆయన ఇక్కడ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ నాయకులు చేసిన డిమాండ్ మేరకు ప్రియాంక గాంధీకి టికెట్ కేటాయించారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఈ నియోజకవర్గంలో సిపిఐ నుంచి సత్యన్ మోకేరి, బిజెపి నుంచి నవ్య పోటీ చేస్తున్నారు. వీరిని కాదని ప్రియాంక గాంధీకి ప్రజలు పట్టం కడుతున్నట్లు తెలుస్తోంది
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. పార్టీ తరపున అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఏ నియోజకవర్గ నుంచి ఆమె పోటీ చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పార్టీకి చెందిన కొన్ని కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆమె ససెమిరా అంది. అయితే రెండేళ్ల పాటు దేశంలో అధికారంలో ఉన్న బిజెపికి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకుల్లో ఆశలు రేకేత్తాయి. ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావంతో ఉన్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ రాయ బరేలి తో పాటు కేరళలోని వయనాడు నియోజకవర్గ నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల ఆయన విజయం సాధించారు. ఏదో ఒక స్థానం నుంచే కొనసాగాలని నిబంధన ఉండడంతో ఆయన వై నాట్ నియోజకవర్గాన్ని వదులుకొని రాయబరేలీలో కొనసాగుతున్నారు. దీంతో ఈ స్థానాన్ని ప్రియాంక గాంధీకి కేటాయించారు. టికెట్ కేటాయించిన తర్వాత ప్రియాంక గాంధీ ప్రచారంలో దూసుకెళ్లారు. పదోనైన వ్యాఖ్యలతో వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండడంతో ప్రియాంక కు అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది.
వయనాడు నియోజకవర్గంలో మొత్తం 9.52 లక్షల కోట్లు నమోదు అయ్యాయి. అయితే ప్రియాంక గాంధీకి ఆరు లక్షల ఓట్లు వస్తాయని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్థి సత్యం మోకేరికేరి తో పాటు బిజెపి అభ్యర్థి నవ్వ హరిదాసులకు వరుసగా 2 లక్షల ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. అయితే ప్రియాంక గాంధీ గెలుపు సునాయాసమే అయినా మెజారిటీ విషయంలోనే తాము ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని కేరళ రాష్ట్ర ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ అంటున్నారు.