https://oktelugu.com/

Election Commission: ఓటర్‌ టర్నవుట్‌ డేలా విడుదల.. ఐదు విడతల్లో ఎలా ఉందంటే..

టర్నవుట్‌ డేటా విడుదలలో ఎలాంటి ఆలస్యం జరగడం లేదని ఈసీ తెలిపింది. ప్రతీ పోలింగ్‌ రోజు ఉదయం 9:30 నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్‌ డేటాను ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌లో ఉంచుతున్నామని తెలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 26, 2024 / 10:30 AM IST

    Election Commission

    Follow us on

    Election Commission: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం(మే 25) వరకు ఆరు విడతల పోలింగ్‌ ముగిసింది. జూన్‌ 1న తుది విడత పోలింగ్‌ జరుగనుంది. ఈ క్రమంలో ఐదు విడతల ఖచ్చితమైన పోలింగ్‌ ఓటర్‌ టర్నవుట్‌ డేటాను ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. పోలింగ్‌ శాతాల డేటా అభ్యర్థులు, ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

    ఎప్పటికప్పుడు డేటా.
    టర్నవుట్‌ డేటా విడుదలలో ఎలాంటి ఆలస్యం జరగడం లేదని ఈసీ తెలిపింది. ప్రతీ పోలింగ్‌ రోజు ఉదయం 9:30 నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్‌ డేటాను ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌లో ఉంచుతున్నామని తెలిపింది. పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఈసీ ఖండించింది.

    సుప్రీంలో విచారణ..
    ఐదు విడతల్లో బూత్‌ల వారీగా పోలింగ్‌ డేటాను వెబ్‌సైట్‌లో ఉంచేలా ఈసీని ఆదేవించాలని ఏడీఆర్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై శుక్రవారం(మే 24న) విచారణ జరిగింది. ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం తెలిపింది. ఈ విచారణ జరిగిన మరుసటి రోజే ఐదు విడతల్లో పోలైన కచ్చితమైన ఓటర్‌ టర్నవుట్‌ డేటాను ఈసీ ప్రకటించడం గమనార్హం.

    ఈసీ వెల్లడించిన ఐదు విడతల పోలింగ్‌ శాతాలు..

    తొలివిడత 66.14

    రెండో విడత 66.71

    మూడో విడత 65.68

    నాలుగో విడత 69.16

    ఐదో విడత 62.20