TG Academic Calendar 2024: కొత్తగా.. కొత్త విద్యా సంవత్సరం.. మారిన స్కూల్ టైమింగ్స్.. కొత్త వేళలు.. సెలవులు ఇవే

అకడమిక్‌ క్యాలండెర్‌ ప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పనిచేయనున్నాయి. జూన్‌ 12న ప్రారంభమయ్యే పాఠశాలలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 24 వరకు కొనసాగుతాయి. ఇక 2025 ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి.

Written By: Raj Shekar, Updated On : May 26, 2024 10:15 am

TG Academic Calendar 2024

Follow us on

TG Academic Calendar 2024: తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం.. తెలంగాణలో జూన్‌ 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. 2024–25 విద్యా సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు కొత్త అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

229 పనిదినాలు..
అకడమిక్‌ క్యాలండెర్‌ ప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు 229 రోజులు పనిచేయనున్నాయి. జూన్‌ 12న ప్రారంభమయ్యే పాఠశాలలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 24 వరకు కొనసాగుతాయి. ఇక 2025 ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి.

సెలవులు ఇలా..
ఇక కొత్త విద్యా సంవత్సరంలో అక్టోబర్‌ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజులు దసరా పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు క్రిస్‌మస్‌ సెలవులు, ఇక 2025 జనవరిలో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆరు రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది.

జనవరి నాటికి సిలబస్‌ పూర్తి..
ఇక పదో తరగతి విద్యార్థులకు 2025 జనవరి నాటికి సిలబస్‌ పూర్తి చేయాలని విద్యాశాఖ పేర్కొంది. తర్వాత రివిజన్‌ క్లాసులు ఉంటాయని పేర్కొంది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్‌ పూర్తి చేసేలా ప్రణాళిక ప్రకటించింది.

యోగా, మెడిటేషన్‌..
ఇక ప్రతీరోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 5 నిమిషాలు యోగా, మెడిటేషన్‌ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చిలో నిర్వహించాలని విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో ప్రకటించింది.

ఉదయం 9 గంటలకే బడిగంట..
ఇక ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. ఉన్నత పాఠశాలలు 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రాథమిక పాఠశాలలు సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగుతాయి. గతేడాది 9:30 గంటకు తరగతులు ప్రారంభించగా ఈసారి అరగంట ముందుగానే ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉదయం 8:45 గంటలకే ప్రారంభమై సాయంత్రం 3:45 వరకు కొనసాగుతాయి.