Homeఅంతర్జాతీయంMaldives: మనతో పెట్టుకుంటే.. మల్దీవులు ఇలా అడుక్కోవాల్సిందే

Maldives: మనతో పెట్టుకుంటే.. మల్దీవులు ఇలా అడుక్కోవాల్సిందే

Maldives: భారత్‌ దెబ్బకు ఇప్పటికే దాయాది దేశం చేతికి చిప్ప వచ్చింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ దేశాలు సాయం చేయనిదే పూట గడవని పరిస్థితి తీసుకువచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. పెద్ద నోట్ల రద్దుతో మొదలైన పాకిస్థాన్‌ పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా పీవోకే ప్రజలు భారత్‌కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపే వరకు పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా ఏడాది క్రితం భారత్‌లో పెట్టుకున్న మాల్దీవులకు కూడా ఇప్పుడు పాకిస్థాన్‌ పరిస్థితితే వచ్చింది. పర్యాటక రంగాన్ని మోదీ కొట్టిన దెబ్బతో మాల్దీవులు ఆర్థిక సంక్షోభంలో కూరుపోయింది. చైనాను నమ్ముకున్న ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ఇప్పుడు అంతర్జాతీయ సాయం అభ్యర్థిస్తున్నారు. హిందూ మహాసముద్రం లోతట్టు ప్రదేశంలో ఉండే మాల్దీవులు అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయని, వాటి నుంచి రక్షణ కోసం తమకు అంతర్జాతీయ నిధుల సమకూర్చాలని వేడుకున్నారు.

ముంపు ముప్పు..
మరోవైపు మాల్దీవులకు ముంపు ముప్పు పొంచి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని, కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించనప్పుడు నష్టపోయే దేశాల్లో మాల్దీవులు మొదటి స్థానంలో ఉంటోందని అధ్యక్షుడు ముయిజ్జు ఆవేదన వ్యక్తంచేశారు. ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులు వంటి దేశాలను ఆదుకోవాలని అభ్యర్థించారు.

పర్యాటకమే ప్రధాన వనరు..
ఇదిలా ఉండగా, మాల్దీవులకు పర్యాటకమే ప్రధాన వనరు. ద్వీపదేశాలన్నీ పర్యాటకంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఈ దేశాలు ఐదేళ్లకోసారి సమేశవమవుతాయి. ఇక్కడ ఆయా దేవాల అభివద్ధే లక్షయంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. తాజాగా మాల్దీవులు, ఆంటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం(మే 27న) సదస్సు జరుగనుంది. ఈ నేపథయంలో ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే.. అందులో కేవలం 14 శాతం ఆదాయం మాత్రమే ఎస్‌ఐడీఎస్‌ దేశౠలకు వస్తోందని ముయిజ్జు వ్యాఖ్యానించారు.

ఆ దేశాలకన్నా ఎక్కువ జీడీపీ
ఇదిలా ఉండగా మాల్దీవులు తలసరి ఆదాయం చిలీ, మెక్సికో, మలేషియా, చైనా జీడీపీ కన్నా ఎక్కువగా ఉంది. ఈమేరకు ప్రపంచ ద్రవ్యనిధి లెక్కలే చెబుతున్నాయి. అయితే సముద్రమట్టాల పెరుగుదల కారణంగా కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు మాల్దీవులకు 500 మిలియన డాలర్లు అవసరం అవుతుందని ముయిజ్జు తెలిపారు. ధనిక దేశాలు సాయం చేయకపోతే ఇంత పెద్దమొత్త సమకూర్చుకోవడం తలకు మించిన భారం అవుతుందని పేర్కొన్నారు.

1994 నుంచి ఎస్‌డీఎస్‌ సమావేశాలు..
ఇక ద్వీప దేశాల సమావేశాలు 1994 నుంచి జరుగుతుఆన్నాయి. మొదటి ఎస్‌ఐడీఎస్‌ సమావేశం 1994లో జరిగింది. సముద్ర జలాలు పెరగడం వలన ఎదురయ్యే సమస్యలపై ఇందులో చర్చించారు. మాల్దీవులలోని 1,192 ప్రాంతాల్లో ఏటా సముద్రమట్టం 3.3 అడుగుల మేర పెరుగుతుందని అంచనా వేశారు. అయితే అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్‌ గయమ్‌ ముందస్తు చర్యల్లో భాగంగా మాలె సమీపంలో సముద్రమట్టానికి 2 మీటర్ల ఎత్తులో 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమ దీవిని నిర్మించి పర్యాటకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు గత సెప్టెంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజ్జు.. పెరుగుతున్న సముద్రమట్టంతో కలిగే నష్టాన్ని నివారించేందుకు దాదాపు 30వేల అపార్ట్‌మెంట్‌లతో రాస్‌ మాలె పేరిట కృత్రిమ ద్వీపాన్ని ఆవిష్కరించారు. అయితే, దీనిని మౌలిక సదుపాయల కల్పనగా వర్గీకరించినందుకు వాతావరణ నిధులకు అర్హత సాధించలేదు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మాల్దీవులలోని కీలక నిర్మాణ పనులను చైనా సంస్థలకే కట్టబెడుతున్నారు. దీంతో భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version