https://oktelugu.com/

Nara Lokesh: లోకేష్ కు టిడిపి పగ్గాలు.. ఆ లెక్కతోనే

2009లో తెర వెనుక ఉండి సేవలందించారు లోకేష్. 2014 ఎన్నికల్లో మాత్రంప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు.

Written By:
  • Dharma
  • , Updated On : May 20, 2024 6:39 pm
    Nara Lokesh

    Nara Lokesh

    Follow us on

    Nara Lokesh: టిడిపి కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ పాత్ర ఏంటి? మంత్రివర్గంలో తీసుకుంటారా? లేకుంటే పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. టిడిపి కూటమికి అధికారం ఖాయమని ఆ మూడు పార్టీలు ధీమాతో ఉన్నాయి. 120 సీట్లతో అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెబుతున్నాయి. అయితేసీఎం గారు చంద్రబాబు,డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మూడు పార్టీల నేతలతో కలిసి మంత్రివర్గం ఉంటుందన్నది ప్రాథమిక నిర్ధారణ అంశం. అయితే లోకేష్ పాత్ర ఎలా ఉంటుంది అన్నది తెలియడం లేదు. గతం మాదిరిగా చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుంటారా? కీలక పోర్టు పోలియోలను అప్పగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

    2009లో తెర వెనుక ఉండి సేవలందించారు లోకేష్. 2014 ఎన్నికల్లో మాత్రంప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. 2017 నాటికి మంత్రి అయ్యారు లోకేష్. 34 సంవత్సరాల్లోనే ఐదు కీలక శాఖలను చూశారు. తల పండే నేతలు నిర్వర్తించే పంచాయితీ గ్రామీణాభివృద్ధి శాఖను సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చి ఉంటే లోకేష్.. మంత్రి గానే కాదు సీఎం గా కూడా ఎన్నికయ్యే వారని పార్టీలో ఒక రకమైన ప్రచారం ఉంది. అయితే ఈ ఎన్నికలు టిడిపికి జీవన్మరణ సమస్యలాంటివి. అందుకే ఆ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. బిజెపితో జతకట్టింది. కూటమి ప్రభుత్వం కావడంతో.. మునుపటిలా లోకేష్ ను ఏకపక్షంగా మంత్రివర్గంలోకి తీసుకుని.. కీలక శాఖలను అప్పగిస్తామంటే కుదిరే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    అయితే పార్టీ పరంగా లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 7 పదులకు దాటుతోంది. మరో ఐదు సంవత్సరాల పాటు ఆయన సీఎం పదవిలో ఉండడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవైపు పార్టీని నడిపిస్తూనే ప్రభుత్వ పాలన అంటే కుదిరే పని కాదు. అందుకే లోకేష్ కు టిడిపి పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర చేశారు. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వారితో మమేకం కాగలిగారు. టికెట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారంలో కూడా ముందంజలో నిలిచారు. లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకే పార్టీ పగ్గాలు అందుకునేందుకు ఇదే తగిన సమయమని సీనియర్లు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. లోకేష్ చేతిలోకి టిడిపి నాయకత్వం బాధ్యతలు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.