https://oktelugu.com/

SBI Bank Jobs: ఎస్బీఐలో 1226 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

SBI Bank Jobs: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. 1226 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులలో 1100 పోస్టులు రెగ్యులర్ పోస్టులు కాగా 126 పోస్టులు బ్యాక్ ల్యాగ్ పోస్టులు కావడం గమనార్హం. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2021 / 10:19 AM IST
    Follow us on

    SBI Bank Jobs: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. 1226 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులలో 1100 పోస్టులు రెగ్యులర్ పోస్టులు కాగా 126 పోస్టులు బ్యాక్ ల్యాగ్ పోస్టులు కావడం గమనార్హం. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    SBI Bank Jobs

    డిసెంబర్ 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. https://sbi.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ప్రారంభ వేతనం 36,000 రూపాయలుగా ఉంటుంది.

    Also Read: బీసీపీఎల్‌లో 36 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

    ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, మెడికల్‌ అలవెన్సులు అదనంగా లభించే అవకాశం ఉంటుంది. ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    Also Read: భారత ఆర్మీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?