https://oktelugu.com/

Bollywood: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన కత్రీనా – విక్కీ పెళ్లి ఫోటోలు…

Bollywood: బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బాలీవుడ్ దిగ్గజాలంతా తరలివచ్చారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్‌ సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్ బార్వారాలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే తమ పెళ్లి వీడియోలు, ఫొటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు ఈ జంట. పెళ్లిని రికార్డు చేసే బాధ్యతను ఓ సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. అయితే, ఆ పెళ్లికి హాజరైన కొందరు అక్కడి చిత్రాలను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 10:07 AM IST
    Follow us on

    Bollywood: బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బాలీవుడ్ దిగ్గజాలంతా తరలివచ్చారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్‌ సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్ బార్వారాలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే తమ పెళ్లి వీడియోలు, ఫొటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు ఈ జంట. పెళ్లిని రికార్డు చేసే బాధ్యతను ఓ సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. అయితే, ఆ పెళ్లికి హాజరైన కొందరు అక్కడి చిత్రాలను తీసి సోషల్ మీడియాలో లీక్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లే స్వయంగా తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

    Vixky Kaushal and Katrina Kaif Wedding

    ఈ మేరకు ఆ పోస్ట్ లో ‘మేమిద్దరం కలిసి కొత్త ప్రయాణం మొదలుపెట్టాం. మీ ఆశీర్వాదాలు కావాలి’’ అంటూ కత్రినా రాసుకొచ్చారు. ఇన్‌ స్టాగ్రామ్  లో  షేర్ చేసిన 20 నిమిషాల్లోనే ఈ ఫోటోలు మిలియన్ లైక్స్ లభించాయి. హిందూ సాంప్రదాయ పద్దతిలో జరుగుతున్న ఈ పెళ్లిలో కత్రినా బుట్టబొమ్మలా మెరిసిపోతుంది. పెళ్లి సందర్భంగా బుధవారమే హల్దీ వేడుక, సంగీత్ నిర్వహించారు. కత్రినా రెడ్ కలర్ సబ్యసాచి లెహెంగాలో పెళ్లికూతురిగా ముస్తాబు కాగా… ఆమెకు తగ్గట్టే విక్కీ కూడా క్రీమ్ కలర్ షేర్వాణీ, తలకు పాగాతో రాయల్ గా కనిపించాడు. ఇక ఈ జంటను ఆలా చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. ఇక కొత్త జంటకు ప్రముఖులతో సహా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కత్రినా, విక్కీల కుటుంబ సభ్యులతోపాటు వారి స్నేహితులు, బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు.

    Vicky Kaushal and Katrina Kaif

    Vicky Kaushal and Katrina Kaif Marriage Photos

    Also Read: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..

    Vicky Kaushal and Katrina Kaif Wedding

    Vicky Kaushal and Katrina Kaif Marriage

    Also Read: కత్రీనా పెళ్లి అరేంజ్‌మెంట్స్ అదుర్స్.. మెనూలో ఎన్ని వెరైటీలో…