https://oktelugu.com/

Group 2 Exams Postponed: తెలంగాణలో పరీక్షల వాయిదాల పర్వం.. గ్రూప్‌–2 వాయిదా ఇంకెన్ని రోజులు.. నిరుద్యోగుల్లో అసహనం?

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌పీఎస్సీ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీ.. రాజ్యాంగ బద్ధమైన ఈ పరీక్షల నిర్వహణ సంస్థకు ఎంతో చరిత్ర ఉంది. పేరు మారుతూ వచ్చింది. చైర్మన్లు మారారు. కానీ పనితీరు మాత్రం మారలేదు. మార్చుకోవడం లేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 24, 2024 / 03:46 PM IST

    Group 2 Exams

    Follow us on

    Group 2 Exams Postponed: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాదాపు 9 ఏళ్లకు తెలంగాణలో గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో నాటి టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషర్‌ విడుదల చేసింది. దాదాపు 700 పోస్టులతో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ విడుదలై ఏడాది దాటింది. కానీ, ఇప్పటికీ పరీక్షలు జరుగలేదు. అంటే 40 ఏళ్ల ఉద్యోగార్హతతో దరఖాస్తు చేసున్న అభ్యర్థుల అర్హత వయసు కూడా దాటిపోయింది. అయినా.. ఇప్పటికీ పరీక్ష నిర్వహించి ఫలితాలు ఇవ్వలేదు. కారణాలు ఏదైనా.. నిరుద్యోగుల జీవితాలతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆటలాడుకుంది అన్నది వాస్తవం. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని.. ఇచ్చినా పరీక్షలు నిర్వహించడం లేదని.. పరీక్షలు నిర్వహించినా ప్రశ్నపత్రాలు లీక్‌ చేస్తుంది అన్న కారణాలతో 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. కానీ, ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా గ్రూప్‌–2 పరీక్ష నిర్వహించలేకపోయింది. టీఎస్‌పీఎస్సీని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. కొత్త కమిటీని నియమించింది. తర్వాత టీఎస్‌పీఎస్సీ పేరును టీజీపీఎస్సీగా మారింది. కానీ, గ్రూప్‌–2 పరీక్ష నిర్వహించలేకపోయింది. గడిచిన ఆరు నెలల్లో కేవలం గ్రూప్‌ – 1 పరీక్ష నిర్వహించడానికే ఆరు నెలల సమయం తీసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్‌ – పరీక్ష ఆగస్టు 7, 8వ తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కానీ, దానిని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డిసెంబర్‌కు వాయిదా వేసింది. డిసెంబర్‌లో ఎప్పుడు నిర్వహిస్తారనేది టీజీపీఎస్సీ కూడా స్పష్టత ఇవ్వలేదు. అభ్యర్థుల విన్నపం మేరకే ఇచ్చామంటున్నా.. అది చాలా మంది విద్యార్థుల్లో అసహనాన్ని పెంచుతుంది.

    Also Read: ఐఐటీ సీటు వచ్చినా.. గొర్రెలు కాసిన విద్యార్థిని.. మీడియా కథనాలతో స్పందించిన సీఎం.. ఆర్థిక చేయూత

    మొదటి నుంచి వాయిదానే..
    తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన లక్షలాది మంది ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు. కానీ కేసీఆర్‌ సర్కార్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ల తర్వాత 18 శాఖల్లోని ఖాళీల భర్తీకి 2022, డిసెంబర్‌లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రూప్‌–2 స్థాయి ఉద్యోగాల భర్తీకి నాటి టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2023 ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే అదే సమయంలో గ్రూప్‌–1 ప్రశ్నపత్రం లీక్‌ అయింది. దీంతో గ్రూప్‌–1 పరీక్ష రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ, గ్రూప్‌–2ను కూడా టీఎస్‌పీఎస్పీ పోస్టుపోన్‌ చేసింది. తర్వాత అదే ఏడాది నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని తర్వాత టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అంతకన్నా ముందే గ్రూప్‌–1 పరీక్ష మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్ష నిర్వహణలో లోపాలతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. దీంతో గ్రూప్‌–2 పరీక్షను టీఎస్‌పీఎస్సీ డిసెంబర్‌కు వాయిదా వేసింది. అయితే 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బీఆర్‌ఎస్‌ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టడంతో డిసెంబర్‌లో కూడా గ్రూప్‌–2 నిర్వహించలేదపోయింది.

    జూన్‌లో గ్రూప్‌–1, ఆగస్టులో గ్రూప్‌–2
    టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ.. గ్రూప్‌–1 పరీక్షను జూన్‌లో, గ్రూప్‌–2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల్లో, గ్రూప్‌–3ని డిసెంబర్‌లో నిర్వహించాని నిర్ణయించింది. ఈమేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది. రివైజ్‌ షెడ్యూల్‌ ప్రకారం.. గ్రూప్‌–1 పరీక్షను నిర్వహించింది. ఫలితాలు కూడా ప్రకటించింది. ఇక గ్రూప్‌–2 పరీక్ష ఆగస్టు 7, 8వ తేదీల్లో నిర్వహించాలిస ఉండగా, డీఎస్సీ పరీక్ష జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో డీఎస్సీ రాసే వారిలో చాలా మంది గ్రూప్‌–2కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయాలని కోరారు. ఆందోళనలు చేశారు. టీజీపీఎస్సీని ముట్టడించారు. చివరక ప్రభుత్వం అభ్యర్థుల ఒత్తిడికి దిగివచ్చింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే ఏ తేదీన నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు.

    వాయిదాలతో పెరుగుతున్న అసహనం..
    పరీక్షల వాయిదాలతో ఇప్పటికే నిరుద్యోగుల్లో అసహనం పెరిగింది. అందుకే గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించారు. ఇపుపడు రేవంత్‌రెడ్డి సర్కార్‌ కూడా కేసీఆర్‌ బాటలోనే పయనిస్తున్నట్లు కరిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు రెండేళ్లుగా ప్రిపరేషన్‌లో ఉన్నారు. వాయిదాల కారణంగా పేద అభ్యర్థులు చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కోచింగ్‌ సెంటర్లు లాభపడుతున్నాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కూడా అంగీకరించారు. కానీ, అభ్యర్థుల ఒత్తిడితో పరీక్షను వాయిదా వేశారు. కానీ, వాయిదాలతో ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించాల్సిన అవసరం ఉంది.

    Also Read: జగన్ కష్టంలో పాలుపంచుకోని కేసీఆర్.. జగన్ కు హ్యాండ్ ఇచ్చినట్టేనా?