Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ ఎస్ జే సూర్య కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది…

సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం కొంతమంది నటులు వైవిధ్యమైన పాత్రలను చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే వాళ్ళు చేసిన ప్రతి పాత్ర కూడా ప్రేక్షకుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : July 24, 2024 3:30 pm

Saripodhaa Sanivaaram

Follow us on

Saripodhaa Sanivaaram: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా పరిచయమైన ఎస్ జె సూర్య తనదైన రీతిలో అక్కడ మంచి సక్సెస్ లను అందుకున్నాడు. వాలి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన తెలుగులో కూడా ‘ ఖుషి ‘ సినిమాను పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతాడు అని అందరు అనుకున్నారు. కానీ ఆ లోపే మహేష్ బాబుతో చేసిన ‘నాని ‘ సినిమా అలాగే పవన్ కళ్యాణ్ తో చేసిన ‘కొమరం పులి’ సినిమాలు మరిచిపోలేని డిజాస్టర్లు గా మిగలడంతో దర్శకుడి గా ఆయన కెరియర్ అనేది ముగిసిపోయింది. ఇక తమిళంలో అడపాదడపా కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ ‘స్పైడర్ ‘ అలాగే విజయ్ హీరోగా వచ్చిన ‘అదిరింది ‘ సినిమాల్లో విలన్ గా నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ‘మానాడు ‘, ‘డాన్ ‘, ‘జిగిర్తాండ డబుల్ ఎక్స్ ‘ లాంటి సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ముఖ్యంగా మానాడు సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది. విలనిజాన్ని పండిస్తూనే దాంతో పాటుగా ప్రేక్షకులను కూడా నవ్విస్తూ ఉంటాడు. అందుకే అతని పాత్ర చాలా హైలెట్ గా నిలవడమే కాకుండా సినిమా సక్సెస్ అవ్వడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. ఇక ఇదిలా ఉంటే స్పైడర్ సినిమా ఫ్లాప్ తర్వాత ఆయనకి తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు…

దాంతో ఇప్పుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని హీరోగా వస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాతో మరోసారి తన లక్కును పరీక్షించుకోబోతున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ని కనక మనం చూసినట్లైతే అందులో ఎస్ జే సూర్య ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా చూపించారు. ఇక దర్శకులు ఎంత కొత్తగా పాత్రలను డిజైన్ చేసుకోగలిగితే ఆయన అంత బాగా నటించి మెప్పిస్తాడు. ఇక రీసెంట్ గా ‘భారతీయుడు 2’ సినిమాలో ఆయన కనిపించినప్పటికీ అది పెద్ద పాత్ర అయితే కాదు. ‘భారతీయుడు 3’ సినిమాలో ఆయన ఫుల్ లెంత్ పాత్రని పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది…

ఇక దర్శకులు కొన్ని వైవిధ్యమైన పాత్రలు రాస్తే ఆయన వాటన్నింటికి న్యాయం చేయగలుగుతాడు. అంతే తప్ప రొటీన్ రెగ్యూలర్ విలన్ పాత్రలను రాసి కమర్షియల్ ఫార్మాట్లో తీసుకెళ్తే మాత్రం ఆయన కూడా కొన్ని రోజులకు ఫేడౌట్ అయిపోవాల్సి వస్తుంది. ఇక అందుకే వైవిధ్యమైన కథంశాలను ఎంచుకున్నట్టే వైవిధ్యమైన పాత్రలను కూడా తను ఎంచుకుంటూ ముందుకు సాగితేనే ఆయన కెరియర్ అనేది ఇటు తెలుగు లోనూ, అటు తమిళ్ లోనూ రెండు ఇండస్ట్రీల్లో కూడా చాలా కాలం పాటు కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక మొత్తానికైతే సరిపోదా శనివారం సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకొని ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలను చేయాలని చూస్తున్నాడు… ఇక అతను అనుకున్నట్టుగానే సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తే ఆయన ఇక్కడ వండర్స్ ని క్రియేట్ చేయవచ్చు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్ సేతుపతి లానే సూర్య కూడా పలు రకాల పాత్రల్లో నటించి తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…