భారత్ లో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల నిరుద్యోగుల శాతం మరింత పెరిగింది. తక్కువ వేతనానికి కూడా పని చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థలలో ఒకటైన పేటీఎం శుభవార్త చెప్పింది. 20,000 ఉద్యోగులను నియమించుకోవడానికి పేటీఎం సిద్ధం కానుందని తెలుస్తోంది.
20,000 మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్ లను పేటీఎం సంస్థ నియమించుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎవరైతే ఎంపికవుతారో వాళ్లకు కమిషన్, జీతంతో కలిపి ఏకంగా 35వేల రూపాయలు లభించనుందని తెలుస్తోంది. పదో తరగతి లేదా పై చదువులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్లకు ఈ విధంగా ప్రయోజనం చేకూరనుంది.
పేటీఎం ఐపీవోకు వస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీల నియామకం జరగనుందని సమాచారం అందుతోంది. పేటీఎం ఐపీవో పరిణామం 16,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం. ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
పేటీఎం సంస్థ భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధం కాగా ఇతర సంస్థలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Paytm will hire 20000 field sales executives before ipo
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com