ఏపీ నిరుద్యోగులకు రాజమండ్రిలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఓఎన్‌జీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.ongcindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
Also Read: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ.. వ్యూహం ఫలించిందా?
33 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ జరగనుండగా ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నిరుద్యోగులు ఈ నెల 21వ తేదీలోగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
33 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలలో 28 ఫీల్డ్ డ్యూటీ ఆఫీసర్ ఉద్యోగాలు కాగా 4 జనరల్ డ్యూటీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఒక జీ.డీ.ఎం.ఓ ఉద్యోగానికి ఖాళీలు ఉన్నాయి. మొదట్లో వేతనం తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో ఈ ఉద్యోగాల్లో చేరిన వాళ్లకు లక్షల్లో వేతనం లభిస్తుంది. తక్కువ సంఖ్యలోనే ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాల భర్తీకి పోటీ తీవ్రంగా ఉండనుంది.
Also Read: టీటీడీ కీలక నిర్ణయం.. వృద్ధులకు, చిన్నారులకు దర్శనం అప్పుడే..?
ఓఎన్‌జీసీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ఖాళీలను భర్తీ చేస్తోంది. రాత పరీక్ష లేకపోవడంతో అర్హత ఉన్న అభ్యర్థులు సబ్జెక్ట్ పై పూర్తిస్థాయిలో పట్టు పెంచుకుంటే సులువుగా ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్